విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేయ‌డంతో స‌హ‌జంగానే సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంది. ఇక ఈ సినిమాలో క‌థ‌లో ఉప క‌థ‌లు వ‌స్తాయి. ఈ ఉప క‌థ‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తే సినిమాలో చాలా చోట్ల విజ‌య్ గ‌త హిట్ సినిమా అర్జున్ రెడ్డి చాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.

 

అర్జున్‌రెడ్డి సినిమాలో విజ‌య్ ఎంత‌లా లోతుగా ప్రేమ‌లో కూరుకు పోతాడో ఇక్క‌డ కూడా అంతే లోతుగా ప్రేమ‌లో కూరుకు పోతాడు. దాని తాలూకు భావోద్వేగాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో లా ఇక్క‌డ హీరో ఎందుకు దారి త‌ప్పుతాడు ? అన్న‌ది ద‌ర్శ‌కుడు స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయాడు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ బాధ ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాన్ని తాకింది. కానీ ఈ సినిమాలో మాత్రం అంత లోతుల్లో హార్ట్ ట‌చ్చింగ్ గా క‌థ‌, క‌థ‌నాలు లేవు.

 

ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో విజ‌య్ ప్ర‌వ‌ర్త‌న చాలా ఓవ‌ర్ గా, మ‌రీ పైత్యంలా ఉంద‌న్న కామెంట్లు కూడా అటు సినిమా చూసిన ప్రేక్ష‌కులు, ఇటు నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్ష‌కులు ఎలా ఫీల‌య్యారో.. ఇక్క‌డ అలా ఫీల‌య్యేందుకు ఆస్కార‌మే లేకుండా పోయింది. సినిమా ప్రారంభం నుంచే గౌతమ్-యామిని కథతో ప్రేక్షకులకు ఒక భావోద్వేగ బంధం ఏర్పరచడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

 

చాలా సీన్లు కృత్రిమంగా ఉంటాయి.. క‌థ స్టార్ట్ అయ్యాకే ప్రేక్ష‌కుడు డిస్క‌నెక్ట్ అయ్యాడంటే ఇక సినిమా ప్రేక్ష‌కులకు ఎంతగా ప‌రీక్ష పెట్టిందో తెలుస్తోంది. ఏదేమైనా అర్జున్‌రెడ్డి ఫ్లేవ‌ర్ నుంచి ఇక‌నైనా విజ‌య్ బ‌య‌ట‌కు వ‌స్తే మంచిద‌న్న అభిప్రాయాలు సర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: