తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ ఇద్దరమ్మాయిలతో’ లతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ కేథరీన్ థెరిసా. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో తన గ్లామర్ తో కనువిందు చేయడమే కాదు కుర్రాళ్ల మనసు దోచింది. అయితే ఈ అమ్మడు చేసిన స్కిన్ షోకి వరుసగా ఛాన్సులు వస్తాయని భావించారు. కానీ అనుకున్న స్థాయిలో ఛాన్సులు మాత్రం రాలేదు.. కాకపోతే అప్పుడప్పుడు తెలుగు లో మెరుస్తుంది. కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ IPS సినిమాతో తెరంగేట్రం చేసిన కేథరీన్ అదే సంవత్సరంలో పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో నటించింది.
అదే సంవత్సరంలో కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది. 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. ఈమె తెలుగులోనె కాకుండ తమిళం, కన్నడ మరియు మళయాళం భాషలలొ కూడ సిమాలు చేసింది. అప్పటి నుంచి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఛాన్సులే వచ్చాయి.. కానీ హిట్ టాక్ మాత్రం రాలేదు. గతేడాది మూడు సినిమాల్లో నటించిన ఆమెకు చెప్పుకోదగ్గ విజయం మాత్రం దక్కలేదు.
శింబు సరసన నటించిన ‘వందా రాజావాదాన్ వరువేన్’ డిజాస్టర్‌గా మిగలగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘నీయా2’ కూడా నిరాశపరిచింది. సిద్ధార్ధ్‌కు జోడీగా నటించిన ‘అరువం’ విమర్శనాత్మకంగా మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగు లో వదలడు మూవీ పేరు తో రిలీజ్ అయ్యింది. ఈ రోజు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తానికి ఈ భామకు టైమింగ్ బాగానే కలిసి వస్తుందని అంటున్నారు