మామూలుగా సినిమాల్లోకి వచ్చే నటీనటులు ఆడిషన్ కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆడిషన్ ద్వారానే కొత్త నటులను సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆడిషన్ లో  సరైన పర్ఫామెన్స్ చేస్తే మంచి పాత్రలు దక్కుతూ  ఉంటాయి. అయితే ఇప్పుడువరకు  మనుషులకు ఆడిషన్ చేయడం చూసాం కానీ   ఇప్పటివరకు ఏనుగులకు ఆడిషన్  చేయడం ఎక్కడైనా విన్నారా... ఏనుగులకు ఆడిషన్ చేయడం ఏంటి... అవేమైనా నటిస్తాయా అంటారా.. కారణం ఏంటో గాని ఓ సినిమాకి మాత్రం ఏనుగులను ఆడిషన్ చేశారు. ఏకంగా  30 ఏనుగులు  ఈ ఆడిషన్ లో పాల్గొన్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఎంతో తెలుసుకుందాం రండి.  

 


 ప్రస్తుతం రానా హీరోగా నటించిన హ్యాపీ మేరీ సాతి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఏప్రిల్  రెండవ తేదీన హిందీ  తెలుగు తమిళంలో పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది ఈ సినిమా. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో హాతి మేరీ సాథీ గా  విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగులో అరణ్య గా  విడుదల చేయబోతున్నారు.ఈ  సినిమాలో  రానా ఒక అడవి మనిషి తరహా గెటప్లో కనిపిస్తున్నారు. ట్రైలర్లు రానా తన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తం అడవిలోనే బతుకుతు ఏనుగుల జీవితంగా జీవించిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అస్సాంలోని జాదవ్ ప్రియాంక్  అనే వ్యక్తి పదమూడు వందల ఎకరాల్లో అడవి ని పెంచారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 

 


 ఇక ఈ సినిమా గురించి రానా సహా ఈ సినిమా దర్శకుడు ప్రభు సాల్మన్  కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు సహ నటులు కూడా లేరు కేవలం నా పైన షూటింగ్ చేయాల్సి ఉండటంతో జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది అంటూ రానా  చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం విషయంలో ఎంతో పర్ఫెక్టుగా పని చేస్తున్నాము అంటూ  తెలిపారు. ఈరోజు సినిమాలో  ఏకంగా 30 ఏనుగులు కనిపిస్తాయని... ఆ 30 ఏనుగుల్లో  ఒక లీడర్ ఏనుగు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు ప్రభు సాల్మన్. అయితే ఆ లీడర్ ఏనుగును  గుర్తించేందుకు వాటికి ఆడిషన్ నిర్వహించామని తెలిపారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా చిత్రీకరణ లో ఎంత పర్ఫెక్షన్ తో వర్క్ చేస్తున్నామని దర్శకుడు ప్రభు సాల్మన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: