టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కరుణాకరన్, తొలి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అప్పట్లో తొలిప్రేమ సినిమా మంచి సాధించడంతో పాటు అటు పవన్ కు, ఇటు దర్శకుడు కరుణాకరన్ కు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో, ఉత్తమ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కరుణాకరన్ కు ఆ సినిమా ద్వారా అవార్డు లభించింది. ఆ తరువాత ఆయన సుమంత్ తో యువకుడు, వెంకటేష్ తో వాసు, మరొక్కసారి పవన్ కళ్యాణ్ తో బాలు, అల్లు అర్జున్ తో హ్యాపీ సినిమాలు  చేశారు, అయితే అవి సక్సెస్ కాలేదు. 

 

ఇక వాటి అనంతరం కొంత గ్యాప్ తీసుకుని ఆయన తీసిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి హిట్ కొట్టింది. ఆ సినిమాకు గాను ఆయనకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా మరొక్కసారి నంది పురస్కారం లభించింది. దాని తరువాత ప్రభాస్ తో డార్లింగ్ సినిమా తీసి హిట్ కొట్టిన కరుణాకరన్, ఆపై రామ్ హీరోగా ఎందుకంటే ప్రేమంట, నితిన్ హీరోగా చిన్నదాన నీ కోసం, అలానే ఇటీవల సాయి ధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు సినిమాలు తీశారు. ఇక మొదటి నుండి కరుణాకరన్ తీసిన సినిమాలు వరుసగా పరిశీలిస్తే, ముఖ్యంగా హృద్యమైన ప్రేమకథ ఆ సినిమాలో ప్రధాన అంశంగా ఉంటుంది. 

 

ఇక ఈ విషయమై కరుణాకరన్ మాట్లాడుతూ, విశ్వవ్యాప్తమైన ప్రేమను తన సినిమాల్లో తప్పకుండా ముఖ్య కథాంశంగా తీసుకుంటానని, ప్రేమ అనేది ఈ విశ్వంలోని మనుషులను ఒకరితో మరొకరితో కలిపే గొప్ప అనుబంధం అని, ప్రేమ లేనిదే మనిషి మనుగడ లేదని కరుణాకరన్ అంటుంటారు. ఇక ప్రస్తుతం మరొక మంచి ప్రేమ కథను తయారు చేస్తున్నానని, అతి త్వరలో ఆ సినిమా వివరాలు మీడియాకు తెలిపారుస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో అన్నారు కరుణాకరన్....!! 


   

మరింత సమాచారం తెలుసుకోండి: