సౌత్ హీరోయిన్స్ లో సమంతకు స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు అప్పటినుండి తెలుగులో స్టార్ లీగ్ లో కొనసాగుతూనే ఉంది. పెళ్లి తర్వాత సహజంగానే హీరోయిన్స్ కు అవకాశాలు రావు.. కాని సమంత మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా వరుస అవకాశాలు అందుకుంటుంది. పెళ్లి తర్వాత సమంత సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. ఇన్నాళ్లు సమంత ఫ్యామిలీ గురించి ఎప్పుడూ వార్తలు బయటకు రాలేదు. లేటెస్ట్ గా సమంతలా ఉన్న ఓ అమ్మడి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి చూసిన వారంతా సమంతకు చెల్లి ఉందా ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

 

అచ్చుగుద్దినట్టు సమంతలా ఉన్న అమ్మడి పేరు ఆత్మిక. ఈమధ్యనే ఇన్ స్టాగ్రాంలో ఆమె పిక్స్ చూసిన కొందరు ప్రేక్షకులు ఆమెకు సమంతకు ఏదైనా చుట్టరికం ఉందా సమంతను జిరాక్స్ కాపీలా ఉంది. ఈ అమ్మడు సమంతకు సిస్టర్ కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆత్మిక సమంత మొదటి సినిమాలో ఎలా ఉందో అలానే ఉంది. అదే క్యూట్ నెస్ ఆమెలో కూడా ఉంది. స్టార్ హీరోయిన్ సమంతని హీరోయిన్ గా తీసుకుని సినిమా చేయాలని అనుకునే వారు ఆమెకు పారితోషికం ఇచ్చుకోలేకపోతే మాత్రం ఆత్మికను ఎంపిక చేసుకోవచ్చు.  

        

నిజంగా ఆత్మిక చూస్తే మీరు ఇదే మాట అంటారు. మనుషులను పోలిన మనుషులు ఉంటారని పెద్దలు అంటారు. ఇలాంటి టైంలో అది నిజమే అనిపిస్తుంది. సమంతని ఆమెను పక్క పక్కన పెడితే గుర్తుపట్టడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. మొన్నీమధ్య అషు రెడ్డి కూడా సమంతకు దగ్గర పోలికలు ఉన్నాయని బిగ్ బాస్ కు ఎంపిక చేశారు. మరి ఈసారి ఆ లిస్ట్ లో ఆత్మిక ఉంటుందేమో చూడాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: