యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ చేస్తూ ఐడెంటిటీ తెచ్చుకున్న చాందిని చౌదరి ఆ తర్వాత సినిమాల్లో అవకాశం అందుకుంది. రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో కెరియర్ లో వెనుకపడ్డది. ఇక కొత్తగా వెబ్ సీరీస్ ల వైపు అమ్మడి గాలి మళ్లినట్టు తెలుస్తుంది. అల్లు అరవింద్ అహా ఓటిటి ఫ్లాట్ ఫాం లో మొదటి వెబ్ సీరీస్ గా వస్తున్న మస్తి వెబ్ సీరీస్ లో చాందిని చౌదరి నటిస్తుంది. నవదీప్, హెబ్భా పటేల్, చాందిని చౌదరి నటిస్తున్న ఈ వెబ్ సీరీస్ ను క్రిష్ నిర్మించారు.

 

పెళ్లైన నవదీప్ చాందిని చౌదరితో రిలేషన్ పెట్టుకుంటాడు. ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ లోనే చాందిని చౌదరి నవదీప్ తో లిప్ లాక్ చేసింది. అది చూసిన ఆమె యూట్యూబ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎలాగు వెండితెర మీద సక్సెస్ అవలేదు కనీసం వెబ్ సీరీస్ లో అయినా కొనసాగాలంటే ఈమాత్రం చేయక తప్పదని అనుకుంది కాబోలు.. అందుకే చాందిని లిప్ లాక్ కు ఓకే చెప్పింది. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫాం వెబ్ సీరీస్ లో హీరోగా ఇప్పటికే చాలా వెబ్ సీరీస్ లో నటించిన నవదీప్ మస్తిలో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకోనున్నాడు.

 

హెబ్బా పటేల్, చాందినితో పాటుగా అక్షరా గుడా, బిందు మాధవి కూడా ఈ వెబ్ సీరీస్ లో నటించారు. క్రిష్ నిర్మించిన ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. అహా మొదటి స్టెప్ తోనే అదరగొట్టగా ఇక మీదట ఇలాంటి వెబ్ సీరీస్ లు వరుసగా చేస్తారని తెలుస్తుంది. అహా టాలెంట్ ఉన్న తెలుగు వాళ్లందరికి ఆహ్వానమని అల్లు అరవింద్ లాంచింగ్ రోజే చెప్పారు.. చెప్పినట్టుగానే న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేలా ఆహా ఆహా అనిపిస్తుంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: