సెన్సేషనల్ స్టార్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ‌కు ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఇటు టాలివుడ్‌లోనూ.. అటు బాలివుడ్‌లోనూ పాపుల‌ర్ అయ్యాడు. విజయ్ దేవరకొండ సినిమాల్లో లవ్ .. ఎమోషన్స్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. ప్రేమను వ్యక్తం చేయడంలోను .. ఆ ప్రేమను పొందడంలోను ఆయన యాక్టింగ్ స్టైల్ కాస్త ఫోర్స్ గా ఉంటుంది. డియ‌ర్ కామ్రేడ్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ న‌టించిన‌ సినిమా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి  కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించారు.

 

గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా న‌టించారు. ఇక మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇదే తన చివరి లవ్‌ స్టోరీ అని విజయ్‌ దేవరకొండ ప్రకటించడంతో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’పై అందరి చూపు పడింది. సినిమా విష‌యానికి వ‌స్తే.. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించారు. 

 

బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు. అయితే ఈ కథకి బలం తక్కువ .. కథనంతో మ్యాజిక్ చేయడానికి క్రాంతిమాధవ్ తనవంతు కృషి చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులపై ఓ వార్త ఖరారు అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులను తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ సంస్థ కొనుగోలు చేసింది.ఈ విషయం ఈ చిత్రం తాలూకా లేటెస్ట్ పోస్టర్ లను కాస్త నిశితంగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఈ పోస్టర్స్ లో తమ శాటిలైట్ పార్ట్నర్ గా జెమినీ ఛానెల్ లోగోను కూడా వేస్తున్నారు. సో ఈ చిత్రాన్ని మ‌రికొన్ని రోజుల్లో మనం జెమినీ ఛానెల్లో వీక్షించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: