యాంకర్ సుమా, బుల్లి తెరను చూసే ప్రేక్షకులు అందరికి కూడా ఈ పేరు ఎంతో సుపరిచితం. ముఖ్యంగా ఆమె మాట్లాడే మాటలు, ఆమె చేసే సందడి ఇంట్లో అమ్మాయి ఉన్నట్టే ఉంటుంది. బుల్లి తెర మీద సుమాని చూడటానికి కూడా చాలా మంది టీవీలు చూస్తూ ఉంటారని అంటున్నారు. ప్రస్తుత౦ తెలుగులో సుమ చాలా సీనియర్ యాంకర్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సుమా హవా తెలుగు బుల్లి తెర మీద నడుస్తుంది. ఏ టీవీ షో అయినా సరే సుమా లేకుండా ఉండే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు పలువురు బుల్లితెర ప్రేక్షకులు. 

 

అయితే ఇప్పుడు ఈమె సినిమా ఈవెంట్ లను కూడా కవర్ చేస్తున్నారు. దాదాపు అన్ని సినిమా ఈవెంట్లు ఇప్పుడు సుమానే చేయడం కుర్ర యాంకర్లకు కాస్త మంటగా ఉందని టాక్. ఇటీవలి కాలంలో ఆమె దాదాపు అన్ని సినిమా ఈవెంట్ లకు యాంకర్ గా పని చేసింది. సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచివాడవురా, అల వైకుంఠపురములో, తాజాగా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ సినిమా ఈవెంట్ కూడా సుమానే కవర్ చేసింది. ఇలా ఏ యాంకర్ కి అవకాశం ఇవ్వకుండా అంతా తానై వ్యవహరిస్తుంది సుమా. సుమా క్రేజ్ కూడా అదే విధంగా ఉంది. 

 

ఎప్పటికప్పుడు పంచ్ లు వేయడమే కాకుండా, ప్రేక్షకులను అలరించే విధంగా ఆమె కామెంట్లు చేయడం, ఇక అందరి హీరోలతో ఆమెకు మంచి పరిచయాలు ఉండటంతో స్టేజ్ మీద కుశల ప్రశ్నలు కూడా వ్యంగ్యంగా వేయడంతో యుట్యూబ్ చానల్స్ కి కూడా ప్లస్ అవుతుంది. ఇక ఆమె భారీగానే వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఈవెంట్ కి కనీసం 10 లక్షలకు పైగా వసూలు చేస్తుందని, స్టార్ హీరో సినిమా అయితే ఆ ఖర్చు 30 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ సినిమాకు కూడా ప్లస్ అవుతుంది కాబట్టి అది ఒక ఖర్చు కాదని అంటున్నారు నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: