ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుత౦ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న సినిమా కోసం రాజమౌళి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. స్టార్ హీరోల సినిమా కావడంతో అటు నిర్మాత కూడా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడటం లేదనే టాక్ కూడా ఉంది. ఖర్చు ఎంత అయినా సరే తాను భరిస్తా అంటూ దానయ్య కూడా చెప్పినట్టు సమాచారం. దీనితో రాజమౌళిసినిమా కోసం మరింత స్వేచ్చగా పని చేస్తున్నాడు. 

 

తన సినిమా కోసం ఎక్కడా రాజీపడే అలవాటు లేని ఆయన ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల విషయంలో హాలివుడ్ సాంకేతిక నిపుణులను కూడా తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనితో కొన్ని ఫైట్ సీన్స్ మరింత పవర్ ఫుల్ గా ఉండే విధంగా తీర్చిదిద్దుతారని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ఎలా అయినా సరే సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. అజయ్ దేవగన్ శ్రేయా మధ్యసీన్స్ చిత్రీకరిస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాట ఉంటుందని అంటున్నారు. ఉద్యమ కారులను ఉల్లాసపరిచే విధంగా కొమరం భీమ్ పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కీలక పాట పాడే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ ఒక ప్రముఖ రచయిత కూడా అందిస్తారని టాక్. ఇక ఇదిల ఆంటే ఈ సినిమాలో ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రేయా మూడో హీరోయిన్ గా అజయ్ దేవగన్ సరసన నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: