పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పై గత కొంత కాలంగా పలు వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. రేణు దేశాయ్ మాజీ పాత్ర అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో  ఇంటిని  రేణుదేశాయ్ కి బహుమతిగా ఇచ్చారని.. అంతేకాకుండా ఆద్య  అక్షరాల కోసం హైదరాబాద్ లో ఇల్లు కొలిచినట్లు వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పూణేలో ఉంటున్న రేణు దేశాయ్  పవన్ కొనిచ్చిన  ఇంటికి మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తనకు సంబంధించి వస్తున్న వార్తలను రేణుదేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు వేస్తారో అర్థం కావడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో తాను కొన్న ఇల్లు తన కష్టార్జితంతో కొన్నాను అంటూ రేణుదేశాయ్ వెల్లడించారు. 

 

 కాగా తనపై వస్తున్న వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా ఎన్నో ఎమోషనల్ కామెంట్ చేశారు. ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం... నిన్నటి నుంచి నాకు మీడియా వాళ్ల నుంచి స్నేహితుల నుంచి వస్తున్న ఎన్నో మెసేజెస్ ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ గా మారిందని తెలిసింది. వాళ్లు నా గురించి వస్తున్న వార్తల గురించి చెప్పింది విని ఎంతో బాధ పడ్డాను అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తికి నిజమైన ఆస్తి తన ఆత్మ గౌరవం... ఒక వ్యక్తికి నిజమైన ఆస్తి తన నిజాయితీ... ఒక వ్యక్తికి నిజమైన ఆస్తి తన ఆస్తిత్వం.. ఇది మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు రేణు దేశాయ్. 

 

 నా జీవితం మనుగడ కోసం ఒంటరిగా తీవ్రంగా నిబద్ధతతో ఎంతగానో శ్రమిస్తున్న అంటూ తెలిపిన రేణుదేశాయ్... ఇప్పుడు వరకు కనీసం మా తండ్రి దగ్గర నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సాయం ఆశించలేదు పొందలేదు అంటూ తెలిపారు. అంతేకాకుండా నా మాజీ  భర్త దగ్గర నుంచి కూడా ఎలాంటి అన్యాయ పూరితమైన భరణాన్ని ఆశించలేదు అంటూ చెప్పిన రేణూదేశాయ్... ఇదే నా వ్యక్తిత్వం అంటూ  తెలిపారు. అయినప్పటికీ మీరు మాత్రం అనవసరమైన అన్యాయమైన అసంబద్ధమైన వార్తలను ప్రచురించడం చేస్తూ ఉన్నారు,. మీరు ప్రచారం చేస్తున్నట్లుగా  హైదరాబాదులో నేను కొన్న ఫ్లాట్ మాకు ఎవరూ కొనివ్వలేదు  నా కష్టార్జితం తోనే కొన్నాను అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. కష్టార్జితంతో ఒక్కో  రూపాయి కూడా పెట్టుకుని సొంతిల్లు కొన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఇల్లును తన మాజీ భర్త తనకు  కొనిచ్చాడు అంటూ వస్తున్న వార్తలను ఆపాలి అంటూ కోరారు

మరింత సమాచారం తెలుసుకోండి: