ఈ మ‌ధ్య టెక్నాల‌జీ పెరిగిన విష‌యం అంద‌రికీ తెలిసందే. కొంత మంది ఈ టెక్నాల‌జీని మంచి విష‌యాల‌కు ఉప‌యోగిస్తుంటే మ‌రికొంత‌మంది దీనితో అడ్డ‌దారులు తొక్కుతున్నారు. ఇంకొంత మంది స‌ర‌దా స‌ర‌దాగా సెల‌బ్రెటీల‌తో గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఇక టెక్నాల‌జీ పెర‌గ‌డంతో ఏదైనా స‌రే గ్రాఫిక్స్‌లో చేస్తూ అంద‌ర్నీ మాయ చేయ‌డం అనేది స‌ర్వ సాధార‌ణమ‌యిపోయింది. టిక్‌టాక్‌లు, డ‌బ్‌స్మాష్‌లు అంటూ ఆఖ‌రికి ప‌ల్లెటూర్లో ఉన్న వాళ్ళు కూడా వారి వారి టాలెంట్‌ను బ‌య‌ట‌పెడ‌తున్నారు. ఇందులో ఆడ మ‌గ అంటూ ఏమీ తేడా లేదు. ఎవ‌రు ప‌డితే వారు ఏదంటే అది చేస్తూ సెల‌బ్రెటీల‌కే సెల‌బ్రెటీలుగా మారిపోతున్నారు. ఇక గ్రాఫిక్స్ విష‌యానికి వ‌స్తే గ్రాఫిక్స్ అనేవి ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన‌వి ఏమీ కాదు. ఎప్ప‌టి నుంచో ఉన్న‌వే. అయితే అవి పాత సినిమాల్లో ఒక‌లా ఉంటే... ఇప్పుడు ఒక‌లా ఉన్నాయి. టెక్నాల‌జీ బాగా పెరిగిపోవ‌డంతో గ్రాఫిక్స్‌లో ఆప్ష‌న్స్ కూడా బాగా పెరిగిపోయాయి.

 

ఇక ఈ మ‌ధ్య వ‌చ్చే శంక‌ర్‌, రాజ‌మౌళి చాత్రాలు దాదాపు గ్రాఫిక్స్‌తో కూడుకున్న‌వే అన్న విష‌యం తెలిసిందే. అవి అంత పెద్ద హిట్ కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం స‌గం గ్రాఫిక్స్ కూడా బాగా రావ‌డ‌మే అనుకోవాలి. ఇక ఇదిలా ఉంటే ఫొటోషాప్ ఈ సాఫ్ట్‌వేర్ గురించి చాలా మందికే తెలిసుంటుంది. ప్ర‌స్తుత త‌రంలో ఇది తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. అతి త‌క్కువ మందికి ఈ ఫొటో షాప్ గురించి తెలియ‌క‌పోవ‌చ్చేమోగాని దాదాపు అంద‌రికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ ఫొటో షాప్‌లో మ‌నం గ్రాఫిక్స్ చేయ‌వ‌చ్చు. 

 

అలాగే ఫొటోస్‌ను కూడా  ఎడిట్ చేయ‌వ‌చ్చు. ఇక చాలా మందికి సెల‌బ్రెటీల‌తో ఫొటోలు దిగాల‌నే కోరిక‌లు ఉంటాయి. అలాగే కొన్ని ప్ర‌దేశాల‌ను చూస్తే అక్క‌డ‌కు వెళ్ళ‌లేక‌పోయినా వెళ్ళిన‌ట్లు ఫొటోషాప్‌లో ఫొటోల‌ను ఎడిట్ చేస్తారు.  ఉదాహ‌ర‌ణ తాజ్‌మ‌హ‌ల్‌తో, చిరంజీవిగారితో దిగిన‌ట్లు ఇలా ర‌క ర‌కాల ఫొటోల‌ను చేసుకుంటుంటారు. అయితే ఇలాంటి ఫొటోనే ఒక‌టి ఒక అబ్బాయి ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫొటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అది ఎవ‌రితో అనుకున్నారు అత‌గాడు ఏకంగా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవితో దిగిన‌ట్లు... మ‌ళ్ళీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని ఏలుతున్న పూజాహెగ్డేను పెట్టుకుని ఫొటో దిగిన‌ట్లు గ్రాఫిక్స్ చేసుకున్నాడు. దీన్ని చూసి నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇలా చిత్ర విచిత్ర‌మైన ప‌నులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: