జూనియర్ ఎన్టీఆర్... ఇతన్ని తెర మీద చూస్తే చాలు అభిమానులు పొంగిపోతారు. అతని నటన చూడటానికి అయినా సరే థియేటర్ కి వెళ్తూ ఉంటారు అతని అభిమానులు. సినిమా కథతో సంబంధం లేకుండా తారక్ లో ఉన్న నటుడ్ని చూస్తే చాలు అనుకుంటారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫాన్స్ ఎక్కువ. దాదాపు అందరు హీరోల అభిమానులు కూడా ఈ విషయంలో తారక్ కే ఓటు వేస్తారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ లో ప్రస్తుతం నటన కోసం ఏది చేయడానికి అయినా సిద్దంగా ఉన్న నటుడు తారక్ అనేది వాస్తవం. 

 

సినిమాలో తన క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తాను ఎంత వరకు అయినా వెళ్తా అని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పాడు తారక్, టెంపర్ సినిమా కోసం బరువు తగ్గడం, ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు బరువు పెరగడం, దర్శకుడు ఏ విధంగా కోరితే ఆ విధంగా ఉండటం, తనను తాను మార్పులు చేసుకోవడానికి నెలలు నెలలు కష్టపడే తత్వం. నటన విషయంలో ఎక్కడా కూడా రాజీ పడని నైజం వంటివి అతనికే సొంతం అనేది వాస్తవం. అందుకే జైలవకుశ సినిమాకు కథతో సంబంధం లేకుండా కష్టపడ్డాడు తారక్ అనేది సినిమా చూసిన అందరికి అర్ధమవుతుంది. 

 

ఆ సినిమాలో కథ లేకపోయినా సరే తారక్ నటన కోసం అభిమానులు వెళ్ళారు. ఇక రాజమౌళి సినిమా కోసం ఇప్పుడు బరువు పెరిగినట్టు సమాచారం. సినిమా కోసం, తన తిండి తో పాటు ఏది అయినా సరే మార్పు చేసుకునే తత్వం ఉన్న నటుడు తారక్ కావడంతో అతనికి ఇప్పుడు టాలివుడ్ లో మంచి డిమాండ్ ఉంది. దర్శకులు అతనితో ఒక సినిమా చేస్తే చాలు తాము ఏది అయినా అతని వద్ద నుంచి నేర్చుకోవచ్చని భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది యువ దర్శకులు కథ తీసుకుని తారక్ వద్దకు వెళ్లి ఎలా అయినా సరే ఒప్పించాలి ప్రయత్నాలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: