జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ... ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే చాలు అని దాదాపు పదేళ్ళ నుంచి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. టాలివుడ్ లో ఆ సినిమా వస్తే... దాన్ని మించిన సినిమా వచ్చే అవకాశమే లేదని నందమూరి అభిమానుల నమ్మకం. రాజకీయంగా వారి మధ్య విభేదాలు ఉండి ఉండవచ్చు గాని అది సినిమా విషయంలో పక్కన పెడితే మంచిది అనేది అభిమానుల కోరిక. నందమూరి అభిమానుల్లో చీలిక మంచిది కాదని అంటూ ఉంటారు. 

 

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వేసవిలో వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనం మొత్తం సిద్దమైంది. రూలర్ సినిమా ఫ్లాప్ లో ఉన్న బాలకృష్ణసినిమా ద్వారా బయటపడాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణసినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. అయితే ఈ సినిమా పూర్తి అవ్వడానికి తారక్ కి కేవలం మూడు నెలలే పడుతుంది. 

 

ఆ తర్వాత జూలై లేదా ఆగస్ట్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే కథ కూడా సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను తారక్, తన బాబాయ్ తో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నందమూరి అభిమానుల కోరిక. ఈ సినిమా కోసం తాము ఎంతో ఎదురు చూస్తున్నామని, నందమూరి హీరోలు అందరూ కలిసి ఒక ఫ్యామిలీ సినిమా చేసి ఐఖ్యత చాటితే బాగుంటుంది అంటూ కోరుతున్నారు. నందమూరి అభిమానుల మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గిపోతుంది కాబట్టి జూనియర్ ముందుకి రావాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: