టెంపర్ సినిమా చూసారు కదా...? యమదొంగ సినిమా చూసారు కదా...? రాఖీ సినిమా చూసారు కదా...? అశోక్ సినిమా...? నాన్నకు ప్రేమతో...? జైలవకుశ...? ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నటన చూసే ఉంటారు కదా...? ఎక్కడ అయినా సరే ఒక్క సినిమాకు మరొక సినిమాకు సంబంధం ఉందా...? అదే జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్. దర్శకుడు కథ రాసుకుని, హీరోని తెర మీద ఇలా చూపిస్తే అభిమానులు ఇష్టపడతారు అనుకుని, ఆ విషయాన్ని తారక్ కి చెప్తే చాలు, దర్శకుడు ఎం చెప్పినా సరే చేయడానికి ఎక్కడా వెనుకాడే పరిస్థితి ఉండదు. 

 

టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని చూసి, ముందు ఏంటీ ఇలా ఉన్నాడు అని అనుకున్నారు అభిమానులే. కాని సినిమాలో జూనియర్ నటనకు ఫిదా అయిపోయారు. పూరికి అలా కావాలి. పూరి సినిమా అలా ఉంటేనే చూస్తారు కాబట్టి అలాగే నటించాలి. అందుకోసం తనలో తాను మార్పులు చేసుకున్నాడు. కథ బాగుంది అనుకుంటే, కథలో తన పాత్ర పలానా విధంగా డిమాండ్ చేస్తుంది అంటే దర్శకుడు ఎలా చెప్తే అలా చేయడానికి తారక్ సిద్దంగా ఉంటాడు అనేది వాస్తవం. అందుకే సినిమా ఫ్లాప్ అయినా సరే తారక్ ఎక్కడా కూడా ఫ్లాప్ అవ్వలేదు. 

 

దర్శకులు కూడా కథను తమకు కావాల్సినట్టు రాసుకుంటూ ఉంటారు అని వింటూ ఉంటాం. ఎలా రాసుకున్నా తాము కోరుకున్న విధంగా తారక్ చేస్తాడు అనేది వాళ్ళ నమ్మకం. ఇక ఏ సీన్ లో కూడా రీటేక్ లు ఉండటం గాని, మరొక ఇబ్బంది గాని తారక్ నుంచి చాలా తక్కువ అంటూ ఉంటారు. ముఖ్యంగా తారక్ నటన నుంచి దర్శకులు ఎన్నో విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారట. సీన్ లో తాము అనుకున్న దానికంటే కూడా తారక్ మరింత బెటర్ గా నటిస్తాడని ఎందరో దర్శకులు అతనితో పని చేసిన వాళ్ళే చెప్పిన మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: