ప్రస్తుతం సిని పరిశ్రమలో నటన కంటే కూడా ఎక్కువ స్టార్ ఇమేజ్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నటన రాకపోయినా సరే తమ స్టార్ ఇమేజ్ తో నెట్టుకొస్తూ ఉంటారు అనే విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. సినిమాలో కథ లేకపోయినా సరే, దర్శకుడు స్టార్ అయితే, హీరో స్టార్ అయితే సినిమా హిట్ అనే భావన అందరిలోనూ ఉంది. అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తి భిన్నం అనే చెప్పుకోవచ్చు. నటన విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి ఉండదు అనేది అతని సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతూ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

సినిమా అయినా, ఎలాంటి కథ అయినా సరే హీరో నటిస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది. ఆ విషయ౦ తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగానే నటిస్తూ ఉంటాడు. నటనకు ప్రాధాన్యత ఇస్తూనే ఎక్కడా తన రేంజ్ తగ్గకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు తారక్. దీనితో దర్శక నిర్మాతలు కూడా అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ అతని నుంచి తమకు ఎం కావాలో అది తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాంటి పాత్ర అయినా సరే తారక్ చేస్తే దానికి అందం వస్తుంది అనే విషయం ఎవరూ కాదనలేరు. 

 

అందుకే టాలివుడ్ లో తారక్ ని /మించిన నటుడు లేరు అంటూ ఉంటారు. ముఖ్యంగా పాత్రలో అతను ఒదిగిపోయే విధానం చూసి ఫిదా అయిపోతారు. టెంపర్ సినిమాలో అతని నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. కోర్ట్ సీన్స్ లో అతని నటన అమోఘం అని విమర్శకులు కూడా ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. అందుకే టాలివుడ్ లో తారక్ ఈ తరం బెస్ట్ యాక్టర్ అని అతని అభిమానులతో పాటు అతని సినిమాలు చూసే అందరూ అనే మాట. అందుకే దర్శకులు కూడా అతనితో సినిమా చేసి కంప్లీట్ గా హ్యాపీ గా ఉంటారని మళ్ళీ అవకాశం ఎదురు చూస్తూ ఉంటారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: