సాధారణంగా స్టార్ హీరోలు అనగానే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక ఇగో ఉంటుంది. నేను ఇలాగే ఉంటాను, నాతో ఇలా అయితేనే సినిమా చెయ్యాలి భావన వారిలో ఎక్కువగా ఉంటుంది. ఏ చిత్ర సీమలో అయినా సరే ఇదే ఎక్కువగా ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వరుసగా సినిమాలు విజయం సాధిస్తే ఆ హీరోని ఆపే పరిస్థితి దాదాపుగా ఎవరికి ఉండదని అంటూ ఉంటారు. అందుకే దర్శక నిర్మాతలు స్టార్ హీరోల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ విషయంలో అతి జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి. 

 

అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అది ఉండదు అంటున్నారు ఆయనతో సినిమా చేసిన నిర్మాతలు. ఒక నిర్మాత కష్టం ఎలా ఉంటుంది...? అతను ఏ ఇబ్బందులు పడతాడు అనేది తారక్ కి తెలిసిన విధంగా మరొకరికి తెలియదని అంటున్నారు. నటన విషయంలో తన నుంచి నిర్మాత ఏమైతే కోరుకుంటాడో అది ఇవ్వడానికి తారక్ కష్టపడతాడని, అదే విధంగా ఖర్చు విషయంలో నిర్మాతను అర్ధం చేసుకోవడమే కాకుండా విదేశాలకు వెళ్ళిన సమయంలో గొంతెమ్మ కోరికలు కోరి నిర్మాతను ఇబ్బంది పెట్టే తత్వం తారక్ ది కాదని అంటున్నారు. 

 

నిర్మాత ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుంటే మాత్రం తన ఖర్చు విషయంలో వెనక్కు తగ్గడానికి తారక్ సిద్దంగా ఉంటాడని, తన నుంచి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు. ఇక కఠిన ప్రదేశాల్లో షూటింగ్ వెళ్ళినప్పుడు అయినా సరే తన సహాయకుల విషయంలో రాజీ పడటానికి అయినా సిద్దంగా ఉంటాడని, ఏదైనా కష్టమని చెప్తే అర్ధం చేసుకునే స్వభావం అతని సొంతం అని అంటూ ఉంటారు. దీనితో చాలా మంది నిర్మాతలు అతనితో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారని, సిని పరిశీలకులు పలు సందర్భాల్లో చెప్పారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: