టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో నటించిన భరత్ అనే నేనుతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక గత ఏడాది యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో హీరోగా నటించి మరొక అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకొని, కెరీర్ పరంగా సూపర్ స్టార్ మహేష్ కు హ్యాట్రిక్ విజయాలు అందించింది. 

 

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి సరిలేరు సక్సెస్ ని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, మరొక నెలలో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ మూవీ ని ప్రారంభించనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ మూవీగా భారీ లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు కొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు కాళీ అని సమాచారం. ఫస్టాఫ్ మొత్తం ఎంతో కూల్ గా ఎంటర్టైన్మెంట్ తో మహేష్ పాత్ర సాగుతుందని, ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి అదిరిపోయే పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తో కూడిన విధంగా కాళీ అనే అత్యద్భుతమైన రోల్లో మహేష్ తన పెర్ఫార్మెన్స్ ని అదరగొట్టనున్నారని సమాచారం. 

 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు బాషా సినిమా ఎంత గొప్ప పేరు తెచ్చిందో మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా కూడా మహేష్ కు ఎంతో గొప్ప పేరు తెస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా కూడా కాళి అని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: