సనాఖాన్ తెలుగులో అక్కినేనినాగార్జున, మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రాం వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. బాగా పాపులర్ పేరే. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాదు బాలీవుడ్ లో నటించింది కూడా. అక్కడ కూడా ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. దాంతో మోడలింగ్ చేసుకుంటూ బండి నెడుతోంది. అయితే తను దారుణంగా మోసపోయిందని వాపోతోంది. న‌మ్మితేనే మోస‌పోతార‌ని చెబుతారు. ఒక వ్య‌క్తితో స్నేహం చేయ‌డానికి ముందు చాలా ఆలోచించాలి. ఆ త‌ర్వాతే ఒక నిర్ణ‌యానికి రావాలి. స్నేహం చేసి లేదా ప్రేమించి...ఆ త‌ర్వాత అలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం...మోస‌పోయాం దేవుడో అంటే ప‌ట్టించుకునే వాళ్లెవ‌రూ ఉంటారా. అదీ మన సినిమా వాళ్ళ విషయంలో. 

 

ఇప్పుడు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌, ప్ర‌ముఖ టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ స‌నాఖాన్ కూడా తాను మోస‌పోయాన‌ని గగ్గోలు పెడుతోంది. కొరియోగ్రాఫ‌ర్ మెల్విన్‌లూయిస్‌తో సనా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే త‌న బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు గుడ్‌బై చెప్పిన స‌నా...ఇప్పుడు అత‌ని గురించి రక రకాలుగా చెబుతోంది.

 

మెల్విన్ లూయిస్ మోసానికి గురైన అమ్మాయిల్లో త‌న సంఖ్య ఎంతో తెలియదని వాపోతోంది. చాలా మంది మ‌హిళల‌ను మెల్విన్‌ మోస‌గించాడ‌ని, అత‌ను ప‌చ్చి మోస‌గాడ‌ని స‌నాఖాన్ ఆరోపిస్తోంది. అయితే త‌ను అంద‌రి ఆడ‌పిల్ల‌ల్లా కాద‌ని, నిజాన్ని నిర్భ‌యంగా చెబుతాన‌ని దీమాగా మాట్లాడుతోంది. వాస్త‌వం చెప్ప‌డానికి ధైర్యం కావాల‌ని, ఆ ధైర్యం తనకుందై వెల్లడించింది.

 

 మెల్విన్‌ను తాను గుడ్డిగా నమ్మానని, కాని అతను పెద్ద మోసగాడని తెలుసుకున్నానని సనా ఆరోపించింది. త‌న‌ను వివాహం చేసుకొని పిల్లలు కనాలని మెల్విన్ కోరుకున్నాడని తెలిపింది. అమ్మాయిలను మోసం చేసే మెల్విన్ త‌న పిల్ల‌ల‌కు ఏం నేర్పుతాడు అని సనా అనడం షాకింగ్ విషయం. అయితే అంతమందిని మోసం చేశాడని తెలిసినప్పుడు నువ్వెందుకు తనకి అవకాశం ఇచ్చావని ఇప్పుడెందుకు గోల పెడుతున్నావని కొందరు నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: