ఎన్టీఆర్... యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎన్నో కోట్లమంది అభిమాన నటుడు.. పేరు చెపితే చాలు ఎంతోమంది అభిమానులు అన్న అన్న అంటూ వచ్చేస్తారు.. అంత మంది అభిమానులను సొంతం చేసుకునేందుకు ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడు.. ఒక సీనియర్ నటుడు మనవడు, నటుడు కుమారుడుగా మాత్రమే అయన సపోర్ట్ ఉంది..

 

అయన అతి చిన్న వయసులో సినిమాలోకి అడుగు పెట్టిన వ్యక్తి.. అలాంటి ఈ ఎన్టీఆర్ అడుగడుగునా కష్టాలను చూశాడు.. ఈరోజు ఇంతమంది అభిమానులు ఉన్నారు అంటే ఆరోజు అయన కష్టపడ్డాడు కాబట్టే.. అలా ఎంతో కష్టపడి ఎదుగుతున్న సమయంలో బాబాయ్ గా బాలయ్య ఉన్న ఎప్పుడు సపోర్ట్ చేయలేదట.. 

 

ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు బాలయ్య బాబు మంచి ఫార్మ్ లో ఉన్నాడు.. ఫ్యాక్షనిజం సినిమాలు తీసుకుంటూ ఇండస్ట్రీని ఏలుతున్న రోజులు అవి.. అలాంటి రోజుల్లో ఎన్టీఆర్ కి బాలయ్య సపోర్ట్ ఉండి ఉంటె ఎన్టీఆర్ రేంజ్ వేరు ఉండేది.. కానీ అప్పుడు ఎప్పుడు బాలయ్య ఎన్టీఆర్ ని చూసింది లేదు.. పట్టించుకుంది లేదు.. 

 

కానీ ఇప్పుడు ''ఉన్నట్టుంది నా కొడుకు ఎన్టీఆర్ వస్తే దబిడి దిబిడే'' అని అంటున్నాడు బాలయ్య.. ఇన్నాళ్లలో ఎప్పుడు ఒక్కసారి కూడా నా కొడుకు ఎన్టీఆర్ అని అన్న రోజులే లేవు.. కానీ ఇప్పుడు జగన్ దెబ్బకు ఏకంగా నా కొడుకు ఎన్టీఆర్ అంటున్నాడు.. అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది ? నిజానికి పొలిటికల్ గా బాలయ్య ఎప్పుడు అంత మాట్లాడినవాడు కాదు.. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు ఉండే.. కానీ ఇప్పుడు సీఎం జగన్ దెబ్బకు ఆ చంద్రబాబుకే మాటలు రావట్లేదు.. ఇంకా బాలయ్య కోసం ఏం వస్తాయి.. 

 

ఇంకా అందుకే మాటలు మాట్లాడటం ప్రారంభించాడు.. పొలిటికల్ గా చంద్రబాబుకు నారా లోకేష్ కు బాలయ్యకు లైఫ్ లేదు అని అర్ధం అయ్యింది.. తండ్రి పెట్టిన పార్టీ ఉండాలి అంటే ఎన్టీఆర్ రావాలసిందే.. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలకు దగ్గరగా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.. బాలయ్య మాత్రం.. నా కొడుకు వస్తే 'జగన్'కు దబిడి దిబిడే అంటున్నాడు. అయినా ఎన్టీఆర్ పై ఇన్నాళ్లకు బాలయ్యకు ప్రేమ పుట్టిందో అని రాజకీయ విశ్లేషకులు.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇవే రాజకీయ ప్రేమలు అంటే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: