శర్వానంద్.. రియాలిటీకి మరో పేరు. టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ ఒకరు.. ప్రతి సినిమా అద్భుతంగా.. హిట్ అయినా ప్లాప్ అయినా చూడాలి అనిపించే నటనతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు శర్వానంద్. తన టాలెంట్ తో అభిమానులను కూడా భారీ సంఖ్యలో సొంతం చేసుకున్నాడు. 

 

అయితే ఈ మధ్య మాత్రం శర్వానంద్ కు అవకాశాలు భారీగా తగ్గుతున్నాయి. వరుసగా 3 సినిమాలు ప్లాప్ అయ్యాయి. చెప్పాలి అంటే తను ఈ మధ్యకాలంలో స్లో అయ్యాడు అనే చెప్పచు.. దీంతో ఇంకో ప్లాప్ పడకుండా తదుపరి చిత్రాలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. 

 

అయితే ఆ హీరో ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడో లేదో ఆలా తనకు ఓ పేరు వచ్చేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో పెద్ద గాసిప్ ఏ నడుస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. శర్వానంద్ కు స్టార్ హీరోయిన్లు అచ్చు రావడం లేదు అనే టాక్ నడుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? 

 

శర్వానంద్ ఇప్పటి వరుకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలా నటించిన చాలా సినిమాల్లో శర్వానంద్ కొత్త హీరోయిన్లతో జోడి కట్టాడు. కొన్ని సినిమాల్లో శర్వానంద్ స్టార్ హీరోయిన్స్ తో నటించారు.. ఆ సినిమాలు ఏంటి అంటే.. నువ్వా నేనాలో శ్రియ, రణ రంగంలో కాజల్, జాను చిత్రంలో సమంతతో కలిసి శర్వానంద్ నటించాడు. 

 

అయితే అలా నటించిన ఈ మూడు సినిమాలలో శర్వానంద్ హిట్ కొట్టలేకపోయాడు. దీంతో శర్వానంద్ ను స్టార్ హీరోయిన్లు తోక్కేస్తున్నారు అని అంటున్నారు. అయితే శర్వానంద్ మాత్రం.. సినిమా హిట్ సూపర్ హిట్ అనేది దర్శకుడి ప్రతిభపై ఆధారపడి ఉంటుందని అంటున్నాడట.. ఏది ఏమైనా శర్వానంద్ కు స్టార్ హీరోయిన్లు కలిసి రాలేదు.. ఇది మాత్రం నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: