ఎన్టీఆర్.. అందరి హీరోల్లా కాదు.. తనకంటూ ఓ మంచి ప్రత్యేకత ఉంది.. ఎంత తాత సీనియర్ నటుడు అయినా.. తండ్రి సీతయ్య అయినా ఎన్టీఆర్ లో పవర్ లేకపోతే స్టార్ హీరో అవ్వడు.. కానీ ఎన్టీఆర్ లో మంచితనం.. కష్టపడేతత్వం అన్ని ఉన్నాయి కాబట్టే స్టార్ హీరో అయ్యాడు.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. 

 

ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడిన ఎన్టీఆర్ కి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు.. అలాంటి ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సినీ హీరో అయ్యాడు.. ఇక వ్యక్తిగత జీవితంకు వస్తే 2011లో ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పెళ్లి చేసుకున్నాడు అనే కానీ.. అతను ఎప్పుడు కూడా భార్యతో బయటకు వచ్చి హాల్ చల్ చేసింది లేదు.. 

 

అప్పుడెప్పుడో మొదటి బాబు పుట్టినప్పుడు భార్యతో ఒక ఫోటో.. రెండో బాబు పుట్టినప్పుడు ఒక ఫోటో అభిమానుల కోసం విడుదల చేశాడు ఎన్టీఆర్. ఇక చెప్పాలంటే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాడు.. అభిమానుల కోసం నెలకు ఒకసారి ఏదో ఒక పోస్ట్ పెట్టి నేను సోషల్ మీడియా వాడుతున్న అని అభిమానులకు గుర్తు చేస్తూ ఉంటాడు.. 

 

ఎన్టీఆర్ ఏ ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో ఉంటాడు.. ఇంకా అతని భార్య అయితే.. వెతికినా కనిపించదు.. ఒకవేళ ఆమె పేరు గూగుల్ లో సెర్చ్ చేస్తే పెళ్లి ఫోటోలు... ఎన్టీఆర్ విడుదల చేసిన రెండు మూడు ఫోటోలు తప్ప మిగితావి కనిపిస్తే ఒట్టు.. ఎన్టీఆర్ కి, అతని భార్య లక్ష్మి ప్రణీతకు సోషల్ మీడియా అంటేనే పడదట.. అందుకే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఇంటికి దగ్గరగా ఉంటుందట..ఏది ఏమైనా అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏ ఒక్క అకౌంట్ లేదు అంటే ఆశ్చర్యం కలగడం లేదు?

మరింత సమాచారం తెలుసుకోండి: