సిని పరిశ్రమలో ఉండే ప్రేమ వ్యవహారాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతు౦ది. వాళ్లకు నచ్చినన్ను రోజులు ఉండటం నచ్చకపోతే విమర్శలు చేస్తూ వెళ్ళిపోవడం, ఇవన్ని సిని పరిశ్రమలో ఎక్కువగా జరిగే వ్యవహారాలూ. ఈ విషయం గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా మనస్పర్ధల పేరుతో ఎక్కువ మంది విడిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇతర దేశాల సంగతి ఏమో గాని మన దేశంలో మాత్ర౦ సిని పరిశ్రమలో ఈ ప్రేమ వ్యవహారాలూ అనేవి ఎప్పుడు ఏదోక సంచలనానికి వేదిక అవుతూనే ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

కొంత మంది విడిపోయిన తర్వాత కాస్త మెచ్యూర్ గా ఆలోచిస్తే మరికొందరు దాన్ని మర్చిపోయి ఏది పడితే అది విమర్శిస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇవి ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక సిని నటి తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.  బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌, ప్రముఖ సినీనటి సనాఖాన్, తన ప్రియుడైన కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌లు ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారు. అంత వరకు ఆగితే బాగానే ఉంటుంది గాని సనాఖాన్ అతనిపై విమర్శలు చేసింది. 

 

తన బాయ్ ఫ్రెండ్‌ కి గుడ్ బై చెప్పిన తర్వాత మెల్విన్ లూయిస్ బాగోతాల గురించి సనాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చాలామంది మహిళలను మోసగించాడని, అతను మోసగాడని ఆమె మండిపడింది. వాస్తవం చెప్పడానికి ధైర్యం కావాలని, మెల్విన్‌ను తాను గుడ్డిగా నమ్మా అని వాపోయిన ఆమె, కాని అతను పెద్ద మోసగాడని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మెల్విన్ నన్ను వివాహం చేసుకొని పిల్లలు కనాలని కోరుకున్నాడు, కానీ అమ్మాయిలను మోసం చేసే అలవాటు ఉన్న మెల్విన్ కు కుమారుడు, కుమార్తెలు పుడితే వారికి ఏం నేర్పుతాడని ఆమె ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: