మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఈ స్టార్ హీరో మంచి జోష్ లో ఉన్నాడు. సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తన కెరీర్ గురించి బన్నీ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ కావడంతో బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 

 

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో అతను మాట్లాడుతూ నటుడు కాకపోతే తాను ఏమి అవుతానో చెప్పాడు. ఒక ఛానల్ ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యు చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను ఆ ఛానల్ తో బన్నీ పంచుకున్నాడు. ‘నటుడు కావాలనే ఆలోచన మీకు ఎప్పుడూ వచ్చింది? ఒకవేళ నటుడు కాకపోతే ఏమయ్యేవాళ్లు? అని యాంకర్ ప్రశ్నించగా... దానికి స్పందించిన అల్లు అర్జున్, ఆసక్తికర వ్యాఖ్య చేసాడు. చిన్నతనంలో నటుడిని కావాలని అసలు అనుకోలేదని చెప్పుకొచ్చాడు. 

 

కెరీర్‌ విషయంలో ఒక్కొ సందర్భంలో ఒక్కొలా అనుకోనేవాడినని వివరించాడు. కొన్నిసార్లు పియోనో టీచర్‌ అవ్వాలనుకున్నా అని చెప్పాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌, అని యానిమేటర్‌, అని విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ అని అవ్వాలి అనుకున్నా అని చెప్పాడు. ఇంకో సంచలన విషయం చెప్పాడు. నాసాలో పని చెయ్యాలి అనే కోరిక కూడా ఒక సందర్భంలో వచ్చిందని అని చెప్పుకొచ్చాడు. చివరికి 18-19 ఏళ్ల వయసు వచ్చేసరికి నటుడు హీరో  కావాలని అని ఫిక్స్‌ అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో కలిసి మూడో చిత్రాన్ని చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: