ప్రస్థుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ ను శరవేగంగా పరుగులు తీయిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ పూర్తి కాకుండానే చిరంజీవి వచ్చే సంవత్సరం నటించబోయే సినిమాల విషయమై ఒక స్థిరనిర్ణయం తీసుకోవాలని చాల లోతుగా ఆలోచిస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే చిరంజీవి కోసం రీమేక్ రైట్స్ తీసుకున్న మళయాళ మూవీ ‘లూసిఫర్’ పై చిరంజీవి మనసు పెట్టడంతో దర్శకుడు సుకుమార్ ఈ మూవీకి ఇప్పటికే ఫినిష్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ నచ్చినప్పటికీ ఈ మూవీ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే విషయంలో చిరంజీవిని ‘జాను’ భయాలు వెంటాడుతున్నట్లు టాక్. విడుదల ముందు నుంచి భారీ అంచనాలు పెంచుకున్న ‘జాను’ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫలితం దిల్ రాజ్ దిమ్మ తిరిగేలా చేసింది. 


వాస్తవానికి ‘జాను’ తమిళ చిత్రం ‘96’ రీమేక్ అన్న విషయం తెలియడంతో అప్పటికే ఆన్ లైన్ లో ‘96’ అందుబాటులో ఉండటంతో ఈసినిమాను తమిళ వెర్షన్ ను జనం పిచ్చి పిచ్చిగా చూసేశారు. ఇలా చూసిన వారు మళ్ళీ కొత్తగా ‘జాను’ లో చూసేది ఏముంటుంది ఒరిజినల్ చూశాం కదా? అందులో త్రిషకు బదులు సమంతను ఊహించుకుంటే సరిపోతుందని ధియేటర్లకు వెళ్ళడం మానేశారు. 


ఇప్పుడు చిరంజీవి నటిస్తాడు అని ప్రచారం జరుగుతున్న ‘లూసిఫర్’  పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అన్న ప్రచారం ఈమూవీ ఇంకా ప్రారంభం కాకుండానే మొదలైంది. వాస్తవానికి ‘96’ మూవీని తెలుగులో డబ్ చేయలేదు. కానీ మలయాళం మూవీ ‘లూసిఫర్’ ను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి ఇప్పటికే విడుదల చేసారు. మోహన్ లాల్ నటించిన ఈ మూవీ తెలుగులో ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా చాలామందికి తెలియదు. అయితే ‘లూసిఫర్’ తెలుగు డబ్బింగ్  వెర్షన్ అమెజాన్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉండటంతో ఇప్పుడు చిరంజీవిమూవీ రీమేక్ లో నటిస్తున్నాడు అని వార్తలు వస్తూ ఉండటంతో ప్రస్తుతం చాలామంది ఈ మూవీని ఆన్ లైన్ లో చూస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ లో సుకుమార్ ఎన్ని మార్పులు చేసినా ఫలితం ‘జాను’ లానే ఉంటుందా అన్న సందేహాలు చిరంజీవికి మనసులో ఏర్పడటంతో ఈ మూవీ రీమేక్ లో నటించే విషయమై ఇప్పుడు చిరంజీవి మనసు మారుతున్నట్లు టాక్. దీనితో చిరంజీవిని నమ్ముకుని చరణ్ ప్రోత్సాహంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్న నిర్మాతలు చిరంజీవి కాకుంటే ఈ మూవీని మరేవ్వరితో తీసి గట్టెక్కాలి అన్న ఆలోచనలలో పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: