టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అసాధారణ పాపులారిటీని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఉన్న యంగ్ హీరోలందరికి గట్టి పోటిగా తయారయ్యాడు. గీతా ఆర్ట్స్ లో నిర్మించిన గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన విజయ్ స్పీడ్ కి ఇక బ్రేకులు పడవని అందరూ అనుకున్నారు. కానీ నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు విజని తిక్కి పట్టి నార తీశాయి. రెండు భారీ ఫ్లాప్ లతో మన రౌడీ హీరోకి దెబ్బ మీద దెబ్బ పడింది. ఇక ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి సున్నితమైన సినిమాలను అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా నెగిటివ్ పడ్డాయి. 

 

సినిమా విడుదలకు ముందు విజయ్ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశామని.. బాల్ స్టేడియం బయట పడుతుందో లేక బౌండరీ దగ్గర పడుతుందో తెలియదని ప్రస్తుతం మాత్రం బాల్ గాలిలో ఉందని యూనిక్ గా ఒక మాట చెప్తూ తన మీద తనే సెటై వేసుకున్నాడు. అదే కామెంట్ ని ఇప్పుడు జనాలు ఆ బాల్ ను బౌండరీ లోపలే ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. సినిమాలో ఇల్లెందు ఎపిసోడ్ తప్ప మిగతా కథతో ఆడియన్స్ తో కనెక్ట్ కాలేకపోయారని దారుణంగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక 'అర్జున్ రెడ్డి' తో పోలిక పెట్టొద్దని అన్నప్పటికి 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో గౌతమ్ పాత్ర భావోద్వేగాలు అర్జున్ రెడ్డిని ప్రతీ సీన్స్ లో గుర్తుతెస్తూ ఉన్నాయి. 

 

ప్రేమలో ఫేయిల్ అయిన సీన్స్ లో విజయ్ పాత్ర ఎమోషన్స్ ప్రతి సినిమాలో ఒకేరకంగా ఉంటుయన్నాయని..  రొటీన్ గా కనిపిస్తోందని కూడా తన ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారు.  ఈ స్టైల్ కనుక మార్చకపోతే ఇక సినిమా కెరీర్ క్లోజ్ అవుతుందని అందుకు కొంతమంది యంగ్ హీరోలని చూపిస్తున్నారు. అంతేకాదు కొంతమంది అభిమానులైతే అర్జున్ రెడ్డి సినిమాలో బాగా మదు తాగే అలవాటు ఉన్న వాడిలా నటించి నిజంగానే మందు అలవాటైందేమో ఆ మైకం లోనే కథ  విని సెలెక్ట్ చేసుకుంటున్నాడేమో అంటూ కామెంట్స్ చేస్తుంటే ఇంకొందరు విజయ్ బ్రేయిన్ డామేజ్ అయినట్టుంది అందుకే ఇలాంటి మైండ్ లేని పనులు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మరి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్స్ట్ సినిమాలో విజయ్ జాగ్రత్త తీసుకుంటాడా లేదా చూడాలి. లేదంటే అదే లాస్ట్ సినిమా అవొచ్చు.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: