బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంటూనే హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం అక్కడ హడావుడి చేస్తున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా. మూడు పదుల వయసు దాటి పెళ్లి అయినా సరే ఎక్కడా కూడా అందం విషయంలో ఆమెలో ఏ మార్పు కనపడటం లేదు. ప్రస్తుత౦ హాలీవుడ్ లో వరుస సినిమాలు కూడా చేస్తుంది. ఇక అక్కడే ఒక యువ సింగర్ ని తనకంటే పదేళ్ళ సింగర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ. ఇక ఫ్యాషన్ విషయానికి వస్తే ప్రియాంకా చాలా మంది హీరోయిన్ల కంటే ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. 

 

ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త ఎక్కువైంది కూడా. ఇక ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, తన కెరీర్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఇది మరింతగా ఎక్కువైంది. ఇక తాజాగా ప్రియాంకా ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రియాంకా చోప్రా సరిగా తనకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఫోటోతో సహా పంచుకుంది. 

 

ఆ టైటిల్ గెలిచి ఇప్పటికి 20 సంవత్సరాలైందని చెప్పుకొచ్చింది. అయినా అది నిన్ననే జరిగినట్లు ఉందని తన అభిమానులకు చెప్పింది ప్రియాంకా. ఇక మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఈ భామ. అమ్మాయిలకు సరైన అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకోస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈమె సటైరికల్ నవల 'వైట్ టైగర్' ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఆమె తాజా హిందీ చిత్రం 'ది స్కై ఈజ్ పింక్’ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

https://www.instagram.com/priyankachopra/?utm_source=ig_embed

మరింత సమాచారం తెలుసుకోండి: