పవన్ కళ్యాణ్ ను ఒక కథ చెప్పి ఒప్పించడం చాల కష్ట సాధ్యమైన పని. పవన్ ఏక్షణాన్న ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు కాబట్టి పవన్ కు కథ చెపుతున్నప్పుడు ఆ కథ ను పవన్ వింటున్నాడో లేదో కూడ తెలియని పరిస్థితి అని అంటారు. గతంలో త్రివిక్రమ్ ‘జల్సా’ మూవీ కథ చెపుతున్నప్పుడు పవన్ ఆ కథ వింటూ పడుకున్న విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 


ఇలాంటి పరిస్థితులలో గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీని తీసి పవన్ ను మెప్పించ లేకపోయిన బాబి ఈ మధ్య వరస పెట్టి సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఒక కమర్షియల్ మూవీ కథ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే పవన్ ఎప్పటికీ తన నిర్ణయం ఈ కథ విషయంలో తేల్చక పోవడంతో విసుకు చెంది దర్శకుడు బాబి ఇప్పుడు అదే కథను హీరో రామ్ కు చెప్పి ఓకె చేయించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి.


‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తరువాత రామ్ అనేక ఆలోచనలు చేసి ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ అయిన శ్రవంతి మూవీస్ తో ‘రెడ్’ అన్న సినిమాను చేస్తున్నాడు. తమిళంలో విడుదలైన ‘తడమ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. 


ఈ మూవీని సమ్మర్ రేస్ కు వచ్చే విధంగా ఏప్రిల్ 9న విడుదల చేసి వెనువెంటనే దర్శకుడు బాబి చెప్పిన కథతో మూవీ ప్రారంభిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ కు నచ్చని ఈ కథ రామ్ కు ఎలా నచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను ఎంచుకుంటున్న కథల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో నిజంగానే పవన్ ఒక మంచి కథను మిస్ అయ్యాడా అని అనిపించడం సహజం..s

 

మరింత సమాచారం తెలుసుకోండి: