కోలీవుడ్ లో మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు మిస్కిన్ ఈ మద్య ‘సైకో’ అనే సినిమా తెరెక్కించారు.  అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ సంచలన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   ఈ మద్య ఆయన   చెన్నైలో 'బారమ్' అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మిస్కిన్ గెస్ట్ గా వెళ్లారు. ఈ సినిమా చూశాక తనను చెప్పుతో కొట్టినట్టు అనిపించిందని అన్నారు.   తనకు మాత్రం తను రూపొందించే సినిమాలు చూస్తే సిగ్గేస్తుందని అంటున్నారు మిస్కిన్.   కాకపోతే దర్శకుడు మిస్కిన్ ఇటీవల 'సైకో' అనే సినిమాని రూపొందించాడు.

 

ఈ సినిమాకి కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. బారమ్ సినిమా ఎంతగానో నచ్చిందని.. ఇలాంటి సినిమా తాను ఎందుకు తీయలేక పోయానో అన్న బాధ తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని అన్నారు. ప్రతీ ఒక్కరూ బారమ్ సినిమాను తమ తల్లితండ్రులతో కలిసి చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. సినిమా చూసిన తరువాత తల్లితండ్రులపై ప్రేమ మరింత పెరుగుతుందని అన్నారు. ఈ మూవీ లో ఎంత అర్థం ఉందని.. తనకు ఎంతగా నచ్చిందో మాటల్లో చెప్పలేనని అన్నారు. అంతే కాదు ఈ  సినిమా చూసిన తరువాత తనొక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. సినిమా పోస్టర్లను తనే స్వయంగా వెళ్లి గోడలపై అతికించి ప్రమోట్ చేస్తానని చెప్పారు. 

 

కాగా, దర్శకుడు కృష్ణస్వామి తెరకెక్కించిన 'బారమ్' గతేడాది విడుదలైంది. ఈ మూవీకి జాతీయ అవార్డు రావడం మరో విశేషం. ఈ మద్య జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో అవార్డు అందుకున్న ఏకైక తమిళ సినిమా ఇదే కావడం విశేషం. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాని ప్రదర్శించారు.   ఇలాంటి సినిమాలను ఆదర్శంగా తీసుకోవాలని మిస్కన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: