టాలీవుడ్ లో అందమైన చందమామ కాజల్ అగర్వాల్. ఈ చందమామని ఎంత సేపు చూసినా తనివి తీరని అందం అని అందరికి తెలిసిందే. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమా యావరేజ్ అయినాగాని కాజల్ పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత నటించిన చందమామ సినిమాతో కాజల్ ఇక ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ తో సహా దాదాపు అందరితోను నటించింది. మంచి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. టాలీవుడ్ లో ఇంత లాంగ్ టైం స్టార్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్స్ లో కాజల్ ఉండటం విశేషం.

 

ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కాజల్ తన సత్తా చాటింది. అక్కడ కూడా స్టార్ హీరోలందరితోనూ నటించి సూపర్ హిట్స్ ని అందుకుంది. ఇక బాలీవుడ్ లో మాత్రం ఈ చందమామ సక్సస్ కాలేకపోయింది. అయితే గత కొంతకాలంగా కాజల్ కి సరైన అవకాశాలు రావడం లేదు. వచ్చినా కూడా సక్సస్ ని ఇవ్వడం లేదు. దాంతో కనిపించిన ప్రతీ ఒక్కరు కాజల్ ని పెళ్ళెప్పుడు అని టార్చర్ పెడుతున్నారట. అందుకు కారణం కూడా బలమైనదే ఉంది. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ అక్క బాటలోనే హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. 

 

అయితే కాజల్ అంతగా నిషా సక్సస్ ని అందుకోలేకపోయింది. ఇంతలో ప్రేమలో పడ్డ ఈ అమ్మడు పెళ్ళి చేసుకొని సెటిలైపోయింది. అంతేకాదు ఒక బిడ్డకి జన్మనిచ్చింది కూడా. దాంతో అందరు గత కొంతకాలంగా కాజల్ అగర్వాల్ వెంట పడుతున్నారు. సోషల్ మీడియాలో గానీ మీడియాలో గాని కాజల్ ని అందరూ అడిగే మొదటి ప్రశ్న మీరెప్పుడు పెళ్ళి చేసుకుంటున్నారు. మీ చెల్లి ఎప్పుడో పెళ్ళి చేసుకొని సెటిలైపోయిందిగా అని అడుగుతున్నారు. అలా అడిగి అడిగి విసిగించేసరికి కాజల్ ఒకసారి కంట్రోల్ తప్పింది. నా పెళ్ళి నా ఇష్టం. నేను ఎప్పుడినా చేసుకుంటా. ప్రతీ సారి ఇలా అడిగి ఇరిటేట్ చేయొద్దు.

 

పెళ్ళి అనేది నా పర్సనల్. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. అయినా నా వ్యక్తిగత విషయాలని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మేము ఎంత సెలబ్రిటీస్ అయితే మాత్రం మా బెడ్రూం లోకి కూడా వచ్చేస్తారా ..మా పర్సనల్ లైఫ్ మాకుంటుంది. అంటు సెటైరికల్ గా దిమ్మ తిరిగిపోయో సమాధానమిచ్చింది. మీరు హీరోలతో రొమాన్స్, లిప్ లాక్స్ కూడా బాగా ఇస్తారు కదా అని కూడా మీడియా వాళ్ళు కాజల్ ని పిచ్చి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి కూడా కాజల్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. నేను నటిని స్క్రిప్ట్ డిమాడ్ చేస్తే చేయాలి అందులో తప్పేంటి. ఇవన్ని సినిమాలో భాగమే. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఇంకోసారి వేయకండి అంటూ కాజల్ మండిపడింది.  వాస్తవంగా చూస్తే నిజమే కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: