నిన్ను చూడాలని సినిమా తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ నేడు ఇండస్ట్రీ టాప్ హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ గా దూసుకుపోతున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి మనసులో ఉన్న ఏకైక హీరో ఎవరంటే నిస్సందేహంగా చెప్ప‌వ‌చ్చు అది ఎన్టీఆరే అని,  రాజమౌళి ఎంతో మంది హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బ‌స్టర్ హిట్లు కొట్టిన ఆయన మనసులో మాత్రం ఎప్ప‌టికీ విపరీతంగా అభిమానించే హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో రాజమౌళి సైతం పరోక్షంగా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ఎందుకంత ఇష్టం వీరిద్దరి మధ్య ఉన్న ఆ బంధం ఏంటన్నది ప్రశ్నించుకుంటే చాలా ఆసక్తి కరమైన విష‌యాలు మనకు కనిపిస్తాయి.

 

 రాజమౌళి కెరియ‌ర్‌ ఎన్టీఆర్ సినిమాతోనే ప్రారంభమైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. అదే రాజమౌళి ఈ సినిమాను కె.రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఎన్టీఆర్ కు అతి చిన్న వయసులోనే స్టార్ డమ్ వచ్చేలా చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వచ్చి యమదొంగ తెరకెక్కి హ్యాట్రిక్ హిట్ కొట్టింద‌నే చెప్పాలి. 

 

 యమదొంగ వచ్చిన 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో రామ్ చరణ్ మరో హీరోగా ఆర్.ఆర్‌.ఆర్? సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి తన కెరీర్లో తెరకెక్కించిన తక్కువ సినిమాలే అయినా ఒక హీరోతో నాలుగు సినిమాలు చేసిన ఘనత ఎన్టీఆర్ తో మాత్రమే రికార్డు గా ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ పై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే రాజమౌళి ఆయనకు ఎప్పుడు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: