టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హరికృష్ణ కుమారుడు అయినా నా ఆ కుటుంబానికి చాలా రోజుల పాటు ఎన్టీఆర్ దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన కుటుంబం నుంచి సహకారం లేకపోయినా ఎన్టీఆర్ ఎంతో కష్టపడి స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాక నందమూరి కుటుంబాలు ఆయన్ని దగ్గరకు తీశాయి. తమ అవసరాల నిమిత్తం వాడుకుని పక్కన పెట్టే వారు. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే ఎన్టీఆర్ నందమూరి, నారా కుటుంబాల నుంచి అభిమానం పొందడం కంటే అవ‌మానాల్ని ఎక్కువగా ఎదుర్కొన్నాడు.

 

అక్కడ అన్ని చ‌క్క పడుతున్నాయి అనుకున్న టైంలో తన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం ఎన్టీఆర్ ను తీవ్రంగా కలిచివేసింది. అప్పటికే అన్న నందమూరి జానకిరామ్ సైతం రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న బాధలో ఉన్న హరికృష్ణ కుటుంబానికి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం పెద్ద మైనస్ గా మారింది. అటు అన్న ఇటు తండ్రి మృతి చెందాక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మరింత దగ్గరయ్యారు అన్నది వాస్తవం. అయితే గ‌తంలో కూడా వీరిద్ద‌రి అనుబంధం బాగానే ఉండేది. కానీ తండ్రి, అన్న దూర‌మ‌య్యాక ఆ ప్రేమ మ‌రింత చేరువ‌యింది.  అప్పటి నుంచి అన్న కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎన్టీఆర్ ఒక డైరెక్టర్ గా మారడం అది వాస్తవం. అప్పటి వరకు వరుస ప్లాపులతో ఉన్న కళ్యాణ్‌రామ్‌ ప్రతి సినిమా కథ ఎన్టీఆర్ వినడంతో పాటు మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. క‌ళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్‌కి చెప్ప‌కుండా ఏ సినిమా కూడా తీయ‌డం లేదు. అలాగే ఎవ‌రైన ద‌ర్శ‌కులు క‌ళ్యాణ్‌రామ్‌కి క‌థ చెప్పాలంటే ముందు అది ఎన్టీఆర్‌కి న‌చ్చాల‌ట‌. ఎన్టీఆర్‌కి న‌చ్చితేనే క‌ళ్యాణ్‌రామ్ ముంద‌డుగు వేస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 సినిమా సైతం హిట్ అయి  క‌ళ్యాణ్‌రామ్‌కి  మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 

ఇక తన సొంత బ్యానర్ మీద కళ్యాణ్‌రామ్ నిర్మించిన సినిమాలు అవ్వడంతో కష్టాల్లో ఉన్న జై లవకుశ సినిమా చేసి ఎన్టీఆర్ ఆదుకున్నాడు. ఏదేమైనా ఇటీవల కళ్యాణ్‌రామ్ ప్రతి సినిమా విషయంలో ఎన్టీఆర్ ఒక మార్గదర్శిగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్న కెరీర్‌ను చక్కదిద్దుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: