నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన తాత లాగానే సినిమాల్లో నటిస్తూ ఆ వంశ ప్రతిష్టలను, ప్రఖ్యాతిని ఇప్పటికీ పెంచుతూ పోతున్నారు. నిజం చెప్పుకోవాలంటే నందమూరి వంశం నుండి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నాడు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో అతనిపై ప్రజలకున్న అభిమానం మాటల్లో వర్ణించలేనిది. అయితే మహానుభావుడైన సీనియర్ ఎన్టీఆర్ పేరుని జూనియర్ ఎన్టీఆర్ కు ఎందుకు పెట్టారో ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం.



హరికృష్ణ చిన్న కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా జ్వరం వచ్చింది. ఇది తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ తన మనవడి బాగోగుల గురించి తెలుసుకోవడానికి తన పర్సనల్ అసిస్టెంట్ ని హరికృష్ణ ఇంటికి పంపించారు. ఆ పర్సనల్ అసిస్టెంట్... హరికృష్ణని, జూ.ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ ఉంటున్న అబిడ్స్ లోని నివాసానికి తీసుకు వచ్చాడు. తరువాత తండ్రి కొడుకులిద్దరు రామారావు పర్సనల్ రూమ్ లోకి వెళ్లారు. అప్పుడు వారి మధ్య ఈ కింది విధంగా సంభాషణ కొనసాగింది.



రామారావు: రండి, కూర్చోండి. (జూ.ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ) నీ పేరేంటి?



జూ. ఎన్టీఆర్: నా పేరు తారక్ రామ్.



అని చెప్పగానే హరికృష్ణ వైపు చూస్తూ నువ్వు ఎందుకు నీ చిన్న కుమారుడికి ఆ పేరు పెట్టావ్ అని ప్రశ్నిస్తారు.

 


దీనికి హరికృష్ణ సమాధానమిస్తూ... ' అమ్మ పేరు కలిసే విధంగా, అలాగే కృష్ణుడి పేరు మా పేర్లలో ఉండేలా బాలకృష్ణ, హరికృష్ణ అని మీరు పెట్టారు. నేనేమో రాముడు పేరు నా కొడుకుల పేర్లలో ఉండేలా కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని పెట్టాను నాన్న గారు', అని అంటారు.



హహహ అని నవ్వుతూ జూ. ఎన్టీఆర్ తో రామారావు కాసేపు ముచ్చటిస్తారు. ఆ సందర్భంలోనే తారక్ లో మంచి క్వాలిటీస్ ఉన్నాయని, అతడు భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతాడని రామారావు గమనించాడు. కొద్దిసేపటి తర్వాత హరికృష్ణతో తారక్ రామ్ పేరుని తారక రామారావు అని మార్చమని చెబుతాడు. దానికి సమ్మతిస్తూ హరికృష్ణ తన చిన్న కుమారుడు పేరు తారక రామారావు అని మార్చాడు. దీంతో ఇంటి పేరుతో కలిపి తారక్ పేరు నందమూరి తారక రామారావు అని మారింది. తాతా-మనవడుల ఇద్దరికి ఒకటే పేరు ఉండటంతో ఒకరిని సీనియర్ ఎన్టీఆర్ అని మరొకరిని జూనియర్ ఎన్టీఆర్ అని మనం పిలుస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: