రౌడీ హీరో గా ముద్ర వేయించుకున్న విజయ్ దేవరకొండ అతి కొద్ది కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ స్టార్ గా ఎదిగాడు. విజయ్ చేసిన సినిమాలు తక్కువే అయినా ఆయన సినిమాల్లో హీరోయిజం డిఫరెంట్ గా ఉండటం తో బాలీవుడ్ లోనూ ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. అర్జున్ రెడ్డి తో పూర్తిగా విజయ్ తన హవాను పెంచుకున్నాడు. ఆ సినిమాలు విజయ నటనకు రౌడీ హీరో అని బిరుదును కూడా ప్రేక్షకులు ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం లో అమాయకపు ముఖం పెట్టి నటించిన తీరు చూసి అర్జున్ రెడ్డి లో ఉన్న విజయ్విజయ్ ఒక్కరైనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాత్రలో అంతగా జీవించి మంచి పేరు తెచ్చుకున్నారు.


 ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం కోసం వారం రోజులుగా విజయ్ హడావుడి చేస్తున్నాడు. ఫ్రీ రిలీజ్ వేడుకలు ఇంటర్వ్యూలు ఇలా ఈ సినిమా పబ్లిసిటీ కోసం గట్టిగా కష్ట పడుతున్నారు. దీనిలో భాగంగానే రాశిఖన్నా తో కలిసి పాల్గొన్న విజయ్ ఆ సందర్భంగా డాక్టర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సినిమా హీరోయిన్ రాశి కన్నా తాను డాక్టర్ తో డేటింగ్ చేయాలని అని అనుకుంటున్నాను అని చెప్పగా... దానిపై స్పందించిన విజయ్ డాక్టర్లతో డేటింగ్ అంటే వేరేలా ఉంటుందని, వారు బాడీని, బుగ్గలను సైంటిఫిక్ నేమ్స్ తో పిలుస్తారు అంటూ అసలు వారిలో రొమాంటిక్ యాంగిల్ ఉండదంటూ సరదాగా ఆమెను ఆటపట్టించే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.దీనిపై డాక్టర్లు ఈ రౌడీ హీరో పై మండి పడుతున్నారు. 


డాక్టర్లలో రొమాంటిక్ యాంగిల్ ఉండదు అంటూ తమను అగౌరవపరిచే అంటూ వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం విజయ్ కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, సరదాగా ఆటపట్టించే ఉద్దేశంతో అన్న మాటలను పెద్దగా సీరియస్ గా తీసుకొనవసరం లేదంటూ విజయ్ కు మద్దతు పలుకుతున్నారు. డాక్టర్లు మాత్రం విజయ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: