అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర వేస్తే అతని ఫోటోలనే దేవుడిగా భావించి పూజించిన రోజులు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి మూడవ తరంలో వచ్చిన తారక్ కూడా అభిమానుల చేత దేవుడు లాగా పూజింపబడుతున్నరని మీకు తెలుసా? వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇద్దరి హీరోలా కోసం అన్నం, నీళ్ళు మానుకొని మరీ అభిమానం చూపించేంత వీరాభిమానులు ఉన్నారు.




ఆ రోజుల్లో రామారావు షూటింగ్ ఎక్కడ జరిగినా వీరాభిమానులు అక్కడికి వెళ్లి పోయేవారు. అలానే ఇప్పట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా... ఎంతోమంది అభిమానులు అక్కడ వాలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ వయసు ఉన్న వారు కూడా తన కాళ్ల మీద పడి అభిమానించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ హీరో గురించి ఏ చిన్న విషయమైనా చెప్పుకోదగినదే. ఇందులోని ఒక భాగమే జూనియర్ ఎన్టీఆర్ యొక్క లక్కీ నెంబర్.



విషయానికి వస్తే ఎంత గొప్పవారైనా తమ శక్తిని తాము నమ్ముకోవడం తో పాటు కొన్ని ఇతర వాటిని కూడా అనుభవాన్ని బట్టి, ఇంకా విశ్వాసం కోసం నమ్ముతారు. లక్కీ నెంబర్ అని లక్కీ డ్రెస్స్ అని, లక్కీ కలర్ అని ఇలా కొన్ని తమకి మంచి చేస్తాయని భావిస్తుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి 9వ నెంబర్ అంటే చాలా మక్కువ. 9వ నెంబరును అతడు తన లక్కీ నెంబర్ గా భావిస్తారు. అందుకే తన సోషల్ మీడియా అకౌంట్ అన్నిటికీ తారక్9999 అంటూ 9 నెంబరు ఉండేలా పెట్టారు. కేవలం సోషల్ మీడియా ఖాతాలకు మాత్రమే కాదు మన బీఎండబ్ల్యూ కార్ కి కూడా 9999 అనే సంఖ్య వచ్చే విధంగా నెంబర్ ప్లేటుని రిజిస్టర్ చేయించుకున్నారు. అందుకుగాను రవాణా శాఖ వారు నిర్వహించిన ఫాన్సీ నంబర్ల వేలంపాటలో తారక్ 10 లక్షల రూపాయలు పెట్టి 9999 ఫ్యాన్సీ నెంబర్ ను కొనుక్కున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతనికి 9 నెంబర్ పై చాలా ఇష్టం అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: