జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కుటుంబాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అన్న విషయం బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్‌ హీరోగా నిలదొక్కుకునే వరకు ఆయనకు నందమూరి కుటుంబం నుంచి పెద్దగా సహాయమేమి అందలేదు. ఎన్టీఆర్‌ బాలనటుడిగా తెరకెక్కిన బాల రామాయణం, తరువాత హీరోగా పరిచయం అయిన నిన్ను చూడలని సినిమాల సమయంలో ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యామిలీ ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఎప్పుడూ నందమూరి కుటుంబ వ్యక్తినే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు.

 

ఎన్టీఆర్‌ హీరోగా ప్రూవ్‌ అయిన తరువాత మాత్రం నందమూరి కుటుంబం చేరదీసింది. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో ఎన్టీఆర్‌ ఒక్కడే స్టార్‌ స్టేటస్‌ అందుకోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ను తమతో కలుపుకున్నారు నందమూరి హీరోలు. ఎన్టీఆర్‌ కెరీర్‌ తార స్థాయికి చేరుకున్న తరువాత బాలయ్య కూడా అడపాదడపా ఎన్టీఆర్‌ సినిమా వేడుకల్లో సందడి చేయటం కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో వారిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి అనటానికి ఏం లేదు.

 

గతంలో ఓ సినిమా రిలీజ్‌ విషయంలో ఎన్టీఆర్‌, బాలయ్యల మధ్య భారీ యుద్ధమే జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్‌లో థియేటర్లు దొరక్కుండా బాలయ్య అడ్డుకున్నాడన్న వార్త అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అప్పటి వరకు ఎన్టీఆర్‌, నందమూరి అభిమానులు ఒక్కటే అని భావించినా.. ఆ  సంఘటన తరువాత నందమూరి అభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారన్న అనుమానాలు కలుగుతున్నాయి.


అంతేకాదు రాజకీయ పరంగానూ ఆ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు టీడీపీ పార్టీకి అత్యంత నమ్మకమైన ఫాలోవర్స్‌ గా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎన్టీఆర్‌ను భవిష్యత్తు నాయకుడిగా కీర్తిస్తున్నారు. దీంతో టీడీపీలోని ఓ వర్గం రగిలిపోతోంది. చిన బాబు లోకేష్‌ను ఎలాగైన భావి నాయకుడిగా ప్రజెక్ట్ చేయాలన్న ఆశలపై ఎన్టీఆర్‌ వర్గం నీళ్లు చల్లటంపై రగిలిపోతున్నారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు వేరు.. నందమూరి అభిమానులు వేరు అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: