ఎన్టీఆర్‌... ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు మనసుల్లో నిలిచిపోయిన ఈ పేరు ఇప్పుడు మాస్ సినీ జనాల మేనియా. టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ముందు వరసుల్లో ఉండే ఈ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు తొలి అవకాశం ఎలా వచ్చింది.? నందమూరి కుటుంబం నుంచి పెద్దగా అండ లేకపోయినా ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా అడుగు పెట్టాడు.?  ఇలా ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది.

 

ఎన్టీఆర్‌ను ఆయన తల్లి షాలిని హీరోగా నిలబెట్టాలన్న కసితో తయారు చేసింది. అందుకే చిన్నతనం నుంచే ఎన్టీఆర్‌కు నటనతో పాటు డ్యాన్స్‌, ఫైట్స్‌ లాంటి వాటిల్లో శిక్షణ ఇప్పించింది. క్లాసికల్‌ డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ప్రావీణ్యం గురించి తెలుసుకున్న తాత తొలిసారిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో జూనియర్‌కు తొలి అవకాశం ఇచ్చాడు. అలా తొలిసారిగా వెండితెర మీద అడుగుపెట్టాడు జూనియర్‌ ఎన్టీఆర్‌.

 

తొలి సారిగా తాత సినిమాలోనే నటించినా రెండో అవకాశం కూడా అంత ఈజీగా ఏం రాలేదు. మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత ఎంఎస్‌ రెడ్డి చిన్నారులతో బాల రామాయణం సినిమాను తెరకెక్కించాలన్న ఉద్దేశంతో బాల నటుల కోసం అన్వేషిస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఇంటి పక్కనే ఉండే పరుచూరి సోదరుల సహకారంతో ఎన్టీఆర్‌ మల్లెమాల సంస్థలో ఆడిషన్‌కు హాజరయ్యాడు. ఎన్టీఆర్‌ ముఖ వర్చస్సు, శాస్త్రీయ నృత్యంలో ఎన్టీఆర్‌ ప్రవేశం కారణంగా శ్రీ రాముని పాత్ర ఎన్టీఆర్‌కు దక్కింది.

 

తరువాత కూడా హీరోగా పరిచయం అయ్యేందుకు కూడా ఎన్టీఆర్‌ చాలా ప్రయత్నాలు చేశాడు. తల్లి ప్రోత్సాహంతో నటనలో మరింత రాటుదేలిన ఎన్టీఆర్‌, ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో రామోజీ రావు తెరకెక్కించిన నిన్నుచూడలని సినిమా ఆడిషన్స్‌కు హజరయ్యాడు. హీరోగా సెలెక్ట్ అయ్యే వరకు తన నేపథ్యం గురించి చెప్పకుండా తన టాలెంట్‌తోనే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. అలా అలనాటి తారక రాముడి వారసుడిగా వెండితెర అరంగేట్రం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: