పని మొదలు పెట్టని వ్యక్తికి దేవుడు కూడ సహాయం చేయడు అన్న సామెత ఉంది. ప్రతి పనికి ప్రారంభం ముగింపు కలిసి ఉంటాయి. అయితే మధ్యలో వచ్చే అపజయాన్ని తట్టుకోలేక చాలామంది తాము ప్రారంభించిన పనిని మధ్యలోనే వదిలి వేస్తారు. వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడ తొలి అడుగుతోనే మొదలవుతుంది.


సంపద సృష్టించాలి అని ఆశించే ఏవ్యక్తి అయినా ముందుగా తన ఆశయ సాధన కోసం వేసే తొలి అడుగులోనే అర్ధ విజయం ఉంటుంది. మన లక్ష్యాల విషయంలో మొదటి 15 శాతం పని పూర్తి చేయడానికి మొదట్లో స్ఫూర్తి ప్రేరణ కృషి పట్టుదల కావాలి. ఈ 15 శాతం పని పూర్తి చేసే విషయంలో ఒక వ్యక్తి తనకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోగలిగితే మిగతా 85 శాతం లక్ష్యాన్ని చాల సులువుగా చేరుకోగాలుగుతాడు.


సాధారణంగా చాలామందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఈ కారణం చేతనే అనేకమందికి అనేక ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు ఆచరణకు నోచుకోవు. ఒక అధ్యయనం ప్రకారం నూటికి 80 మంది మొదటి 15 శాతం పని పూర్తి చేసే విషయంలో వైఫల్యం చెందుతూ ఉంటారు. దీనివాలనే వారికి అశాంతి నిరుత్సాహం కలుగుతూ ఉంటాయి. అందరికీ ధనవంతులు కావాలని ఆసలు ఉన్నా దానికి సంబంధించి సంపాదనకై తొలి అడుగు వేయకుండా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు తమకు సరిపోతాయి అన్న భావంతో రిస్క్ చేయడానికి అంగీకరించరు. 


విద్యుత్తు బల్బ్ కనిపెట్టిన థామస్ ఎడిసెన్ కానీ విమానాన్ని కనిపెట్టిన రైటు సోదరులు కానీ డిస్నీ ల్యాండ్ స్థాపించిన వాల్ట్ డిస్నికి కానీ భారత పారిశ్రామిక దిగ్గజం ధీరుబాయి అంబానికి కానీ విపరీతంగా కష్టపడకుండా విజయం దక్కలేదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని జీవన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఎదురయ్యే కష్టాలను ఎదురించి తట్టుకోగలిగిన వ్యక్తి మాత్రం విజయాన్ని అందుకోగలుగుతాడు. అందుకే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అప్పుడే విజయంతో పాటు సంపద లభిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: