ఎన్టీఆర్ .. ఈ మూడక్షరాల పేరు ఓ బ్రాండ్ ఇమేజ్ అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. తరాలెన్ని గడిచినా చెదిరిపోని, ఇగిరిపోని వెండితెర శ్రీగంధంలా పరిమళిస్తూనే ఉంది. ఆయ‌నే మ‌న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నత కధానాయకుడి మనవడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కూడా తాత అడుగుజాడల్లోనే నడుస్తూ తెలుగు తెరపై ప్ర‌స్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. రూపంలో, నటనలో తాత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్.. నటన, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఇక ప్ర‌స్తుతం టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్‌. వాస్త‌వానికి  తాత నందమూరి తారక రామారావు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించి ప్రేక్ష‌కుల‌ను మిప్పించాడు. ఆ త‌ర్వాత నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చాడు. అలాగే హీరోగానే పౌరాణిక‌, సాంఘీక సినిమాలు చేస్తాడు. 

 

ఇక సింగ‌ర్‌గా నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో ఐవ‌న ఫాలోయు సాంగ్ మ‌రియు క‌న్న‌డ పునీత్ రాజ్‌కుమార్ ప‌వ‌రో సినిమా కోసం గెల‌యా గెలుపు నీద‌య్యా సాంగ్స్ పాడి మంచి మార్కులే కొట్టేశాడు ఈయ‌న‌. ఇక అప్పుడ‌ప్పుడు తాను న‌టించే సీన్ల‌లో త‌ప్పులుంటే నిర్మొహ‌మాటంగా చెప్ప‌డంతో పాటు ఇలా చేస్తే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుల‌కు చెబుతూ.. సినిమా కోసం త‌న‌వంతు కృషి చేయ‌డంలో ఎన్టీఆర్  ముందుంటాడు. కాగా, ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తన నటనా కౌశల్యాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నాడు. పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: