ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ స్టార్లలో ఎన్టీఆర్‌ ముందు వరసలో ఉంటాడు. నటన, క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఇలా ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు తారక్‌. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తప్పటడుగులు వేసినా ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్‌. ముఖ్యంగా టెంపర్‌ సినిమా తరువాత ఎన్టీఆర్, కథల ఎంపికలో చాలా తేడా కనిపిస్తోంది. అంత ముందుకు ఒకే మూస సినిమాలు చేసిన జూనియర్‌ టెంపర్‌ నుంచి విభిన్న కథలు ఎంచుకుంటున్నాడు.

 

అయితే కథల ఎంపికలో కొత్తగా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్‌ కమర్షియల్ మూస నుంచి మాత్రం బయటకు రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నందమూరి ఫ్యామిలీకి మాస్‌ ఫాలోయింగ్‌ ఎక్కువన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్‌ ఎక్కువగా మాస్‌ ఫార్ములా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. దర్శకుడెవరైన నేపథ్యమేదైన ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ హీరోయిజం, డ్యాన్స్‌లు, ఫైట్లు ఇలా ఓ టెంప్లెట్ లోనే సాగుతోంది.

 

తన దగ్గరకు వచ్చిన కథేలే అలా ఉంటున్నాయో, లేక వచ్చిన కథలను ఎన్టీఆర్ అలా మార్చమని కోరుతున్నాడో తెలియదు గానీ ప్రయోగాలకు అవకాశం ఉన్న కథలను కూడా ఎన్టీఆర్‌ మాస్ ఫార్మాట్లోనే చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో లుక్‌, మేనరిజమ్స్‌ విషయంలో చాలా కొత్తగా ట్రై చేశాడు ఎన్టీఆర్‌ కానీ టేకింగ్ దగ్గరికి వచ్చేసరికి మాస్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. అంతకు మించి ఎన్టీఆక్‌ కెరీర్‌లో పెద్దగా ప్రయోగాత్మక సినిమాలనేవి లేవనే చెప్పాలి.


ఎన్టీఆర్ పాత్రనైన అద్భుతంగా పండించగలడన్నది నిర్వివాదాంశం. కానీ ఎన్టీఆర్‌ ఇమేజ్‌, ఫాలోయింగ్, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకత నిర్మాతలు తారక్‌ కోసం ఫార్ములా కథలను మాత్రమే రెడీ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్‌ కూడా అలాంటి కథలే చేస్తున్నాడు. మరి మూస మాస్ ఫార్ములాను దాటి ఎన్టీఆర్‌ ఓ డిఫరెంట్ రోల్‌ ఎప్పుడు చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: