సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ మంచి అంచనాల మధ్య నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై  పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు 6.5కోట్ల గ్రాస్ ను అలాగే 4.34కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డీసెంట్ అనిపించింది. 
 
నిజానికి మొదటి రోజు ఈచిత్రం 7కోట్ల వరకు షేర్ ను రాబడుతుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేశాయి కానీ నైట్ షోస్ లో  భారీగా డ్రాప్ కనిపించడం తో డీసెంట్ వసూళ్ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు మొదటి రోజు డియర్ కామ్రేడ్ 6.80కోట్ల షేర్ ను గీత గోవిందం 5.40కోట్ల షేర్ ను రాబట్టాయి.  ఇక ఫేమస్ లవర్ 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో  ఈ సినిమాతో కూడా బయ్యర్ల కు భారీ నష్టాలు తప్పేలా లేవు. 
 
 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ లవర్  మొదటి రోజు వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 2.05 కోట్లు 
సీడెడ్ - 0.37 కోట్లు 
ఉత్తరాంద్ర - 0.51 కోట్లు 
గుంటూరు - 0.43 కోట్లు 
తూర్పు గోదావరి - 0.31 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.24 కోట్లు '
కృష్ణా - 0.25 కోట్లు 
నెల్లూరు - 0.18 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ మొత్తం  = 4.34కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: