హీరోయిన్ శ్రియ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై చాలా రోజులవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తూనే ఉంది. గత కొన్నేళ్ళుగా ఆమె సినిమాలు చేయడం తగ్గించింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూనే తనకి నచ్చిన పాత్రల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే శ్రియ కొన్ని రోజులు క్రితం ఆండ్రీ అనే అతడిని పెళ్ళి చేసుకుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. శ్రియ ఇప్పటి వరకు తన వ్యక్తిగత విషయాలేవీ మీడియాతో పంచుకోలేదు.

 

 

 


ఆమెకి తన వ్యక్తిగత విషయాలని పంచుకోవడం ఇష్టం ఉండదని చెప్పింది. అయితే మొన్నతికి మొన్న ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన భర్త గురించి చాలా విషయాలే చెప్పుకొచ్చింది. వారి లవ్ ట్రాక్ గురించి చెబుతూ..మొదటగా వారిద్దరూ మాల్దీవ్స్ లో కలిశారట. అలా కలిసినపుడు శ్రియ నటి అన్న విషయం ఆండ్రీకి తెలీనే తెలీదట. 

 

 

 

తాను నటిని అన్న విషయం తెలిసిన తర్వాత ఆన్ లైన్ లో తాను నటించిన సినిమాల్ని చూసాడట. తాను నటించిన అర్జున్ సినిమాలో ఒక పాటను సెయింట్ పీటర్స్ బర్గ్ లో షూట్ చేశారు. ఆ విషయాన్ని తాను మర్చిపోయానని.. ఆండ్రీ మాత్రం తనను అక్కడకు తీసుకెళ్లి.. అర్జున్ సినిమాలో ఒక పాటలో ఇక్కడే నువ్వు నటించావు.. డ్యాన్స్ చేశావంటూ అప్పటి విషయాల్ని గుర్తు చేశాడట. ఆండ్రీ అలా చేయడం తనకు చాలా బాగా నచ్చినట్లు చెప్పింది. 

 

 

 

 

 


ఆండ్రీని పెళ్ళిచేసుకోవడం నిజంగా తన అదృష్టమని చెప్పుకొచ్చింది. తన లాంటి సపోర్ట్ ఇచ్చే భర్త దొరకడానికి చాలా అదృష్టం ఉండాలని పేర్కొంది. మొత్తానికి అమ్మడు పెళ్ళయ్యాక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: