తెలుగు సినిమా లో అగ్ర తారగా చిరంజీవి ఎదగడానికి ఎంతోమంది కారణం అయితే ఈయన వాళ్ళలో ముఖ్యుడు అనే చెప్పుకోవాలి. మెగా స్టార్ చిరంజీవి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజ్ కుమార్ ఇక లేరు.

 

 

రీసెంట్ గా మీడియా లో మనం ఆయన గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఆయన ఆరోగ్యం బాలేదు అనీ పెద్ద ప్రైవేటు ఆసుపత్రి లో అడ్మిట్ కూడా అయ్యారు అని మనకి తెలుసు. అయితే ఆయన ఆరోగ్యం ఇటీవల విపరీతంగా క్షీణించడం తో మృతి చెందినట్టు తెలుస్తోంది.

 

 

 

రాజ్ కుమార్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు .. ఆయన భార్య - పెద్ద కుమారుడు కూడా అనారోగ్యం కారణం గా చనిపోయారు. ఆ తరవాత ఆయన ఒంటరిగా ఒక్కరే బతుకుతున్నారు. ఇప్పుడు ఆయనకి సరైన సంపాదన కూడా లేని కారణంగా అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు.

 

 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

 ఆయన శరీరానికి అంత్యక్రియలు అక్కడే జరిపిస్తారు. ఈయన చిరంజీవి తో తీసిన మొదటి సినిమా పునాది రాళ్ళు ఆ తరవాత పెద్దగా సినిమా లు తీయలేదు, అయితే పునాది రాళ్ళు విడుదల లేటు అవ్వడం తో ప్రాణం ఖరీదు విడుదల అయ్యింది. అయినప్పటికీ మొదటి సినిమా గా పునాది రాళ్ళు గురించే చిరంజీవి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. 

 

 

చివరి రోజులలో తీవ్ర అనారోగ్యం రావడం తో చిన్న కొడుకు ఆయన ని చేరదీశారు. ఆసుపత్రి దగ్గర నుంచి అన్నీ విషయాల్లో అతనే చూసుకున్నాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: