ఎన్టీఆర్‌ అద్భుత నటనకు, తిరుగులేని ఇమేజ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. ఒక మామూలు హీరో సక్సెస్‌ అవ్వటం కన్నా వంశ గౌరవం అన్న భారీ బరువును తలకెత్తుకున్న ఓ హీరో సక్సెస్‌ అవ్వటం చాలా కష్టం. అలాంటి కష్టతరమైన పనిని ఎంతో సులువుగా సాధించి చూపించిన నటుడు ఎన్టీఆర్‌. అందుకే ఎన్టీఆర్‌ తాతకు తగ్గ మనవడు అనిపించుకోగలిగాడు. హీరోగా పరిచయం అయిన దగ్గర నుంచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్న ఎన్టీఆర్‌ ఈ జనరేషన్‌ హీరోలెవరు టచ్‌ చేయని ఓ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

యంగ్‌ జనరేషన్‌ హీరోల్లో ట్రిపుల్‌ రోల్‌లో నటించిన ఒకే ఒక్కడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌. జై లవ కుశ సినిమాలో మూడు పాత్రలో కనిపించాడు ఎన్టీఆర్‌. అంతేకాదు ఈ సినిమాలో మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ లుక్స్‌, డిఫరెంట్ మేనరిజమ్స్‌, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌ ఉన్నా.. ఆ మూడు పాత్రలకు తనదైన నటనతో జీవం పోసిన నటుడు తారక్‌. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పోషించిన జై పాత్రకు అద్భుతమైన పేరు వచ్చింది.

 

తన ఇమేజ్‌ను పక్కన పెట్టి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాదు ఈ సినిమాలో నత్తితో ఇబ్బంది పడుతూ డైలాగ్‌ చెప్పటం ఆ ఇబ్బందితోనే భీబత్స రసాన్ని అద్భుతంగా పండించటం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమవుతుందని ప్రూవ్‌ చేసుకున్నాడు. అంతేకాదు అల్లరి దొంగగా, అమాయకుడైన బ్యాంక్‌ అధికారిగా మరో రెండు వేరియేషన్స్‌ను కూడా చాలా బాగా పండించాడు. ప్రతీ సన్నివేశంలోనూ తెర మీద కనిపిస్తుంది ఏ పాత్రో లుక్‌, బాడీలాంగ్వేజ్‌తోనే గుర్తుపట్టే గలిగేంతగా  ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడు తారక్‌.

 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్‌ అన్న, నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్‌ ఎన్టీఆర్ట్స్‌ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించారు. 2017 సెప్టెంబర్‌లో రిలీజ్‌ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించటమే కాదు, నిర్మాతగా కళ్యాణ్‌ రామ్‌కు, హీరోగా నటుడిగా ఎన్టీఆర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: