భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగిల్స్‌తో కెరీర్ ప్రారంభించినా.. ఆ తర్వాత డబుల్స్‌లో కూడా రాణించి ప్రపంచ 'నెంబర్ వన్'గా ఎదిగిన ఓ అతివ పోరాట పటిమ ఈమె. అంతే కాదు.. 2005లో టైమ్ పత్రిక "50 హీరోస్ ఆఫ్ ఆసియా" అనే ఒక జాబితాను ప్రకటిస్తే.. అందులో స్థానం సంపాదించుకున్న అమ్మాయిగా అందరినీ ఆశ్చర్యపరిచిన ఓ రియల్ స్పోర్ట్స్ ఉమన్. అయితే సానియా మీర్జా జీవితం ఇప్పుడు తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే సానియా మీర్జా జీవితం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.
దీని గురించి సానియానే ఓ భేటీలో స్వయంగా తెలిపింది. తన జీవిత చరిత్ర తెరకెక్కనున్న విషయం నిజమేనని, దీని గురించి కథారచయితతో పలు అంశాలు షేర్ చేసుకోనున్నానని సానియా తెలిపారు. అలాగే తన చరిత్రను చూపించడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటోంది. అంతేకాకుండా.. `` నాది ఎలాంటి వ్యక్తిత్వమో , నా కెరీర్‌ను మొదటి నుంచి చూసిన ఎవరికైనా తెలుస్తుంది. నేను మనసు ఒకటి బయటకు మరోటి మాట్లాడను.. అలా ఏదీ దాచుకోను. నాకు ఏమనినిపిస్తే అది చేస్తా. ఏ విషమైనా బయటికి చెప్తాను.
కాబట్టి నా కథను అభిమానుల ముందుకు తెస్తున్నందుకు భయపడట్లేదు. కాబట్టి నా జీవిత చరిత్రను సినిమాగా రాబోతుండటం ఉత్సాహం కలిగిస్తోంది అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ విజేతలను ప్రేమిస్తారు. కానీ ఎన్నో అడ్డంకులను అధిగమి ఆ స్థానానికి చేరుకువాల్సి ఉంటుంది. నా లానే ఎంతోమంది క్రీడాకారులు.. స్టార్స్ గా ఎదిగారు. దేశానికి ప్రాతినిథ్యం వహించారు`` అంటూ చెప్పుకొచ్చింది సానియా. అయితే ఈ చిత్రాన్ని ఎవరు దర్శకత్వం వహించనున్నారు? తన పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. కాగా, రెండేళ్ల విరామం తీసుకున్న సానియా అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే