సినిమా రంగంలో 'నందమూరి' వంశం అంటే ఒక బ్రాండ్. నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. తాత అడుగుజాడల్లోనే నడుస్తూ తెలుగు తెరపై ప్ర‌స్తుతం త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్ర‌మంలోనే నటన, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి నృత్యకళాకారుడు. సినీ యాక్టర్. టెలివిజన్ షోల నిర్వాహకుడు. నేపధ్య గాయకుడు. ఇలా...అభిరుచి ఉన్న అన్ని రంగాల్లోనూ కృషి చేస్తూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. టాప్ పొజిషన్‌లో నిలిచారు. అయితే ఆ స్థాయికి వ‌చ్చే క్ర‌మంలోనే ఎన్నో ఎన్నెన్నో క‌ష్టాలు ప‌డ్డారు. వాస్త‌వానికి కుటుంబంలో ఏర్పడిన కొన్ని అనివార్య కారణాల 11 ఏళ్ల వరకూ తాత ఎన్టీఆర్ ని కలుసుకునే అదృష్టం జూనియర్ ఎన్టీఆర్ కి కలగలేదు. అయితే ఆ త‌ర్వాత అచ్చం తన పోలికతోనే ఉన్న మనవడిని చూసి పులకించి పోయిన ఎన్టీఆర్ ఆ కుర్రాడికి తనపేరు పెట్టారు. 

 

అలాగు జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రాజకీయాల్లో కూడా పనిచేసారు. అప్పట్లో తెలుగుదేశం తరఫున ఈయన చేసిన ప్రచారం సంచలనమే. కాని, ఎన్టీఆర్ పెళ్ల‌య్యాక నారా, నంద‌మూరి ఫ్యామిలీలు ఆయ‌న్ను దూరం పెట్టాయి. అలాగే వ‌రుస ప్లాపుల త‌ర్వాత‌ హిట్లు వ‌స్తోన్న టైంలో అన్న జాన‌కీరామ్ మ‌ర‌ణం ఎన్టీఆర్ తీర‌ని లోటుగా మిగిల్చింది. ఇక అర‌వింద స‌మేత సినిమా షూటింగ్ టైమ్‌లో తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణంతో డీప్ షాక్‌లోకి వెళ్లిపోయాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. త‌ర్వాత ఆ షాక్ నుంచి తేరుకోవ‌డానికి ఎన్టీఆర్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇలా ప్ర‌తిసారి ఏదో ఒక క‌ష్టం ఎన్టీఆర్‌ను త‌లుపుత‌డుతూనే ఉంది. కాగా, ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: