పులిని దూరంగా చూడాలనిపించిందనుకో చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిదనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని పులితో ఆటాడుకుంటే మాత్రం వేటాడేస్తది. అలాంటిది వేటాడే పులినే ఎన్టీఆర్ పరుగులు పెట్టిస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ కోసం యంగ్ టైగర్ ఫస్ట్ టైమ్ పెద్ద పులితో భారీ సాహసమే చేసినట్టు తెలుస్తోంది. 

 

దర్శకధీరుడు రాజమౌళి పర్ ఫెక్షన్ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. ఆయనతో సినిమా అంటే హీరోలు కూడా పక్కా కమిట్ మెంట్ తో పాటు ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతారు. జక్కన్న హీరోయిజాన్ని పీక్స్ లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఎలివేట్ చేస్తాడనేది తెలిసిందే. ముఖ్యంగా హీరోల ఇంట్రడక్షన్ కు రాజమౌళి ఎంచుకునే మార్గం అద్భుతంగా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు సంబంధించి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. 

 

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతుండగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ ఇంట్రడక్షన్ గురించి క్లారిటీ లేదు. అయితే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ మాత్రం రోమాలు నిక్కపొడిచే రేంజ్ లో ఉంటాయని వినిపిస్తోంది. ఇంట్రడక్షన్ లో ఎన్టీఆర్ పులితో చేసే సాహసం సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందనే టాక్ నడుస్తోంది. 

 

గ్రాఫిక్స్ పులితో కాకుండా రాజమౌళి రియల్ పులితోనే ఎన్టీఆర్ పై ఫైట్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. పులితో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా కష్టపడ్డట్టుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ మధ్య  పులితో ఫైటింగ్ కు సంబంధించి కొన్ని షాట్స్ లీకయ్యాయి. అవి కేవలం శాంపిల్స్ మాత్రమేనట. చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి బాహుబలి రికార్డ్స్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను స్టార్స్ గా మరో మెట్టు ఎక్కిస్తాడనే విషయంలో సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: