బాల రామాయణం సినిమాతో టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన నటరత్న ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, చిన్నవయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన ఎన్టీఆర్, ఆపై రాజమౌళి దర్శకత్వంలో నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ కొట్టి, రెండవ సినిమాతోనే తన స్టామినాని టాలీవుడ్ కి పరిచయం చేసారు. ఇక ఆ తరువాత ఆయన నటించిన సుబ్బు పెద్దగా సక్సెస్ కాలేదు, అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని పలు రికార్డ్స్ నెలకొల్పడంతో పాటు ఎన్టీఆర్ కు మంచి మాస్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. అనంతరం ఆయన నటించిన అల్లరి రాముడు, నాగ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 

 

అయితే ఎన్టీఆర్ కెరీర్ ఏడవ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి, అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ కు స్టార్ హీరోగా ఎంతో పేరును తెచ్చిపెట్టింది. అయితే దాని తరువాత ఆయన నటించిన ఆంధ్రావాలా సినిమా ఘోరంగా ఫ్లాప్ అవడం జరిగింది. నిజానికి అంతకముందు సింహాద్రి తో సూపర్ డూపర్ హిట్ కొట్టి సూపర్ క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్, ఆంధ్రావాలాతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. అయితే ఒకవేళ ఆ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకున్నా ఆయన అప్పట్లోనే కెరీర్ పరంగా మరింతగా దూసుకుపోయేవారు. ఆపై ఆయన నటించిన సాంబ యావరేజ్ విజయాన్ని అందుకోగా, అనంతరం వరుసగా వచ్చిన నా అల్లుడు,నరసింహడు, అశోక్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టి, ఎన్టీఆర్ ఇమేజ్ కొంత ఇబ్బందిని కలిగించాయి. 

 

అయితే సింహాద్రి అత్యద్భుత విజయంతో మంచి జోష్ మీద ఉండడంతో, ఆంధ్రావాలా సినిమాపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలు అందుకునేలా సినిమాని తీయడంలో దర్శకుడు పూరి పూర్తిగా విఫలం అవ్వడంతో, అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. నిజానికి ఆ సినిమాకు చక్రి అందించిన సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి. ఒకవేళ ఆ సినిమా కనుక విజయాన్ని అందుకుని ఉంటె, తదుపరి ఎన్టీఆర్ సినిమాల లైనప్ మరింత బాగుండేదని, ఆపై కూడా ఆ విధంగానే ఆయనకు హిట్స్ లభించి, ఎన్టీఆర్ కు మరింత పేరు ప్రఖ్యాతలు దక్కేవని ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటుంటారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: