చమ్మక్ చల్లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ త్రెసా అల్లు అర్జున్ హీరోగా పూరి డైరక్షన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాతో అమ్మడు లైమ్ లైట్ లోకి రాగా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం విఫలమైంది. పైసా, ఎర్రబస్సు సినిమాల్లో నటించిన కేథరిన్ త్రెసా రుద్రమదేవి సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది. కెరియర్ లో సరైన ఛాన్సులు అందుకోని ఈ అమ్మడు సైడ్ పాత్రలతో సరిపెట్టుకుంటుంది. నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయకా సినిమాల్లో కూడా అలా వచ్చి ఇలా వెళ్లిన కేథరిన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది.    

 

క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కేథరిన్ త్రెసా స్మిత పాత్రలో నటించింది. సినిమాలో ఆమెది చిన్న పాత్రే అని చెప్పొచ్చు. శీనయ్య పాత్రని తన అందంతో ఇంప్రెస్ చేసి ఆమెకు దగ్గరయ్యేలా చేసే పాత్ర ఆమెది. అయితే ఈ సినిమాపై కేథరిన్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీతో అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందని అనుకుంది. కాని సినిమా టాక్, కలక్షన్స్ ఎలా ఉన్నా కేథరిన్ కు ఈ సినిమా కూడా నిరాశపరచింది.

 

సినిమాలో ఆమెది పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాదు ఏదో అలా ఉండాలి కాబట్టి ఉంది. స్మిత పాత్రలో కేథరిన్ ను ఎందుకు తీసుకున్నారు అంటే ఆఫీసర్ పాత్రలో కనిపించే గ్లామర్ డాల్ గా ఉంటుందని ఆమెను తీసుకున్నారు. అయితే కేథరిన్ కెరియర్ కు ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడదని మాత్రం చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి కెరియర్ ఎంతోకొంత మైలేజ్ వస్తుందని అనుకున్న కేథరిన్ కు ఈ సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది. తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో మాత్రం కేథరిన్ మంచి ఆఫర్లే రాబట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: