ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్రపడితే కెరీర్ ను కంటిన్యూ చేయడం చాలా కష్టం. అందులోనూ స్టార్ హీరోకు ఫ్లాప్ ఇస్తే.. ఆ దర్శకులని ఒక రకంగా చూస్తుంటారు. ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతుంది. అలాంటి ఇది నుంచి బయటపడి.. మళ్లీ బిజీ అవుతున్నారు కొంతమంది దర్శకులు. 

 

బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ ఫ్లాప్ తో శ్రీకాంత్ పనైపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఓ ఊరమాసు కథతో మళ్లీ జనాల ముందుకొస్తున్నాడు అడ్డాల. వెంకటేశ్ తో నారప్ప అనే సినిమా తీస్తున్నాడు. తమిళ హిట్ అసురన్ రీమేక్ గా వస్తోంది నారప్ప. 

 

శ్రీకాంత్ అడ్డాల తర్వాత వరుణ్ తేజ్ ని డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో వీళ్లిద్దరి సిినిమా ఉంటుందనే టాక్ వస్తోంది. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. 

 

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన మేర్లపాక గాంధీకి, కృష్ణార్జున యుద్ధంతో భారీ నష్టం వచ్చింది. ఈ ఫ్లాప్ తో గాంధీని అందరూ లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు నితిన్ అంధాదుస్ రీమేక్ కోసం మేర్లపాకని మీట్ అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కాబోతుందని.. 2020 క్రిస్మస్ కు సినిమా రిలీజ్ అవుతుందనే టాక్ వస్తోంది. 

 

ఫ్లాపుల ఎఫెక్ట్ తో చాలాకాలం అజ్ఞాతంలో గడిపిన ఈ దర్శకులు, రీఎంట్రీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారు. లైఫ్ అండ్ డెత్ ప్రాజెక్ట్స్ గా మారిన ఈ రీమేకులతో మళ్లీ ఫామ్ లోకి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: