ఇండస్ట్రీలో లేడీస్ ని తొక్కేస్తారని ఓ జనరలైజ్డ్ ఒపీనియన్ ఉంది. ఇక డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో అయితే మహిళలకు ప్లేసే ఉండదని చెబుతారు. కానీ ఓ లేడీ డైరెక్టర్ మాత్రం మెగా ఫోన్ తో మేజిక్కులు చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ స్టార్స్ తో సినిమాలు తీస్తోంది. 

 

వెంకటేశ్, సూర్య, ఇళయదళపతి విజయ్ లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేయాలంటే దర్శకులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి స్టార్ డైరెక్టర్స్ కు కూడా వీళ్ల కాల్షీట్స్ సంపాదించడం గగనమైపోతుంది. అయితే సుధా కొంగర మాత్రం ఎలాంటి బజ్ లేకుండా భారీ స్టార్స్ తో సినిమాలు తీస్తోంది. సౌత్ లో క్రేజీ డైరెక్టర్ మారుతోంది.

 

సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో సూరారై పొట్రు అనే సినిమా చేస్తోంది. తెలుగులో ఈ మూవీ ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ లైఫ్ స్టోరీతో రూపొందుతోంది సినిమా. ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ ఆకాశం తర్వాత కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తోంది సుధా కొంగర. 

 

సుధ ఇంతకుముందు వెంకటేశ్ తో గురు సినిమా తీసింది. మాధవన్ తో తమిళ్, హిందీలో సాలాఖడూస్ తెరకెక్కించింది. సుధ వరుసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తుండటంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఓ లేడీ డైరెక్టర్ కు టాప్ హీరోస్ ఎలా ఒకే చెబుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. అయినా టాలెంట్ కు మేల్, ఫీమేల్ అనే తేడాలుండవు కదా. చెప్పిన కథను చెప్పనట్టు తెరకెక్కించే సామర్థ్యం ఉన్నోళ్లు ఎక్కడైనా రాణిస్తారు. ఈ బలంతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతోంది సుధా కొంగర. మొత్తానికి సుధా కొంగర బెస్ట్ లేడీ డైరెక్టర్ అనిపించుకుంటోంది. తన ప్రతిభకు పదును పెడుతూ అరుదై చిత్రాలు తీయడంలో తన మార్క్ చూపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: